Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 03:12 AM

ఖేడ్ మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగరేయడమే లక్ష్యం

08-02-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నారాయణఖేడ్ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ జోరుగా ప్రచారం కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా 2, 3, 4వ వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి ప్రజలను కోరారు.2వ వార్డు నుంచి మంజుల దుర్గయ్య,3వ వార్డు నుంచి స్వప్న అభిషేక్ షెత్కార్,4వ వార్డు నుంచి అభిషేక్ షెత్కార్బిఆర్ఎస్ తరఫున కారు గుర్తుపై పోటీ చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఓటరు తమ విలువైన ఓటును కారు గుర్తుకు వేసి బిఆర్ఎస్ విజయంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి మాట్లాడుతూ…తాను ఎమ్మెల్యేగా ఉన్న బిఆర్ఎస్ పాలనలో నారాయణఖేడ్ పట్టణ అభివృద్ధికి విశేషంగా కృషి చేశామని తెలిపారు. పట్టణంలోని ప్రతి గల్లీకి సీసీ రోడ్లు నిర్మించామని, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లు ఇచ్చి తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించిన ఘనత బిఆర్ఎస్‌కే దక్కుతుందని చెప్పారు.అలాగే నారాయణఖేడ్ పట్టణంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, ఆక్సిజన్ పార్క్ వంటి కీలక వసతులు ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు గుర్తు చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్‌కు అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.ఖేడ్ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా బిఆర్ఎస్ ముందుకు సాగుతుందని, ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఘన విజయం ఖాయమని నేతలు ధీమా వ్యక్తం చేశారు.

Sthanikam

ఖేడ్ మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగరేయడమే లక్ష్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News