Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 09:55 AM

ఖాసీంపేట బేతెస్థ మందిరంలో శుభ శుక్రవారం ఆరాధనలు ఘనంగా

03-04-2026 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మానవాళి పాప పరిహారార్థం సిలువపై ప్రాణాలు అర్పించిన యేసు

క్రీస్తు మరణం ప్రేమ, క్షమ, త్యాగానికి ప్రతీక

బిషప్ దుర్గం హెప్సిబా ప్రభాకర్

సూర్యాపేట పట్టణం 4వ వార్డు ఖాసీంపేటలోని బేతెస్థ ప్రార్థనా మందిరంలో శుభ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక ఆరాధనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా బిషప్ దుర్గం హెప్సిబా ప్రభాకర్ మాట్లాడుతూ, యేసు క్రీస్తును సిలువ వేయడం, కల్వరి కొండపై ఆయన మరణం క్రైస్తవ విశ్వాసులకు మాత్రమే కాక సమస్త మానవాళికి రక్షణకు ప్రతీక అని తెలిపారు.

పవిత్ర వారం లో భాగంగా ఈస్టర్ ఆదివారం కు ముందు వచ్చే శుక్రవారం రోజున యేసు క్రీస్తు మానవాళి పాప విమోచనార్థం తన ప్రాణాలను అర్పించుకున్నాడని తెలిపారు. ఈ రోజును శుభ శుక్రవారం, మహా శుక్రవారం అని కూడా పిలుస్తారని వివరించారు.

క్రీస్తు సువార్తల ప్రకారం శుక్రవారం రోజునే సిలువ వేయబడినట్టు పేర్కొన్నారు. ఖగోళ మరియు ధార్మిక ఆధారాల ప్రకారం ఆ సంఘటనలు విశేషమైన ప్రాధాన్యత కలిగి ఉన్నాయని వివరించారు. యేసు సిలువపై మరణించినప్పుడు ప్రకృతిలో సంభవించిన మార్పులు కూడా విశ్వాసానికి బలాన్ని చేకూరుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తీతు, బాబు, ఉపేందర్, యేసుపాదం, వెంకన్న, జానయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఖాసీంపేట బేతెస్థ మందిరంలో శుభ శుక్రవారం ఆరాధనలు ఘనంగా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News