Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 02:09 PM

కేవైసీపై బీబీనగర్‌లో అవగాహన ర్యాలీ

కేవైసీపై బీబీనగర్‌లో అవగాహన ర్యాలీ

కేవైసీపై బీబీనగర్‌లో అవగాహన ర్యాలీ
10-02-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందర్భంగా బీబీనగర్‌లో “కేవైసీ – సురక్షిత బ్యాంకింగ్‌కు మీ మొదటి అడుగు” అనే అంశంతో వాక్‌థాన్ నిర్వహించారు. ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకింగ్ లావాదేవీల్లో కేవైసీ అత్యంత కీలకమని వక్తలు వివరించారు. అనుమానాస్పద కాల్స్‌, సందేశాలు, లింకులకు స్పందించవద్దని ప్రజలకు సూచించారు. వ్యక్తిగత వివరాలను ఎవరికీ తెలియజేయకూడదని హెచ్చరించారు.

కేవైసీ పూర్తిచేసుకోవడం ద్వారా బ్యాంకింగ్ మోసాలకు చెక్ పెట్టవచ్చని, సురక్షిత లావాదేవీలకు ఇది తొలి అడుగని వక్తలు పేర్కొన్నారు. గ్రామస్థాయిలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగితే ప్రజలు ఆర్థికంగా మరింత భద్రంగా ఉంటారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహాయ ప్రధాన అధికారి లక్ష్మీ శ్రావ్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ కే. శివ రామ కృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి జాకీరోద్దిన్, డీఆర్‌డీవో సర్ప్ డీపీఎం వెంకటేశం, బీబీనగర్ ఏపీఎం మీనా, వివిధ బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లు, సిఎఫ్‌ఎల్ కౌన్సెలర్లు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

కేవైసీపై బీబీనగర్‌లో అవగాహన ర్యాలీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News