Sthanikam - Truth Matters
Logo

కెసిఆర్ పై సిట్ విచారణకు నిరసనగా నార్కట్ పల్లిలో బిఆర్ఎస్ రాస్తారోకో

Updated : 01 Feb 2026 12:00 IST
As Preferred Source 1 min read
కెసిఆర్ పై సిట్ విచారణకు నిరసనగా నార్కట్ పల్లిలో బిఆర్ఎస్ రాస్తారోకో

నార్కెట్‌పల్లి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో . మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారించడాన్ని నిరసిస్తూ పార్టీ శ్రేణులు రాస్తారోకో చేపట్టాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని సిట్ విచారణ పేరుతో వేధింపులకు పాల్పడుతోందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. ప్రజల తీర్పుతో ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడిపై కక్షపూరిత చర్యలు తగవని వారు మండిపడ్డారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతూ…

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, రైతు–పేదల పక్షాన అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన కేసీఆర్‌ను ఇబ్బందులకు గురిచేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ఇలాంటి చర్యలను బీఆర్‌ఎస్ శ్రేణులు క్షమించవని హెచ్చరించారు.

రాస్తారోకో కారణంగా కొంతసేపు నార్కెట్‌పల్లి–నల్లగొండ ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులతో చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం నిరసనకారులు శాంతియుతంగా తమ కార్యక్రమాన్ని ముగించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని బీఆర్‌ఎస్ నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Sthanikam

కెసిఆర్ పై సిట్ విచారణకు నిరసనగా నార్కట్ పల్లిలో బిఆర్ఎస్ రాస్తారోకో

Article Image

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news