Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 08:15 AM

కేసీఆర్‌పై సిట్ విచారణకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో బిఆర్ఎస్ భారీ నిరసన

01-02-2026 97 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేటలో వెయ్యి బైకులతో ర్యాలీ

తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సిట్ విచారణ పేరుతో ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని బిఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో నల్ల బ్యాడ్జీలతో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు, మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంతకండ్ల జగదీశ్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో బిఆర్ఎస్ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి బైఠాయించి నిరసన తెలిపారు.కేసీఆర్‌ను వ్యక్తిగతంగా అగౌరవపరచడమే ఏకైక లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని, చట్టాలను లెక్కచేయకుండా న్యాయవ్యవస్థను కించపరుస్తూ సిట్ నోటీసుల పేరుతో దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సిట్ అధికారుల తీరును తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా కోర్టు చౌరస్తా నుంచి సుమారు వెయ్యి బైకులతో ప్రారంభమైన ర్యాలీ పీఎస్ఆర్ సెంటర్, వాణిజభవన్, శంకర్ విలాస్ సెంటర్ మీదుగా కొత్త బస్టాండ్ వరకు కొనసాగింది. ఆదివారం నల్ల బ్యాడ్జీలతో శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఆచరణ సాధ్యం కాని హామీలతో, మాయమాటలతో ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తూ 420 అబద్ధపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును ప్రజల్లో ఎండగట్టే దిశగా పోరాటం కొనసాగిస్తామని బిఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, ట్రైకార్ మాజీ చైర్మన్, సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ రామచంద్ర నాయక్‌తో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

కేసీఆర్‌పై సిట్ విచారణకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో బిఆర్ఎస్ భారీ నిరసన

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News