Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:56 AM

కేజీబీవీ,సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

కేజీబీవీ,సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

కేజీబీవీ,సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
March 16, 2026 08:19 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని టిఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో యుఆర్ఎస్ లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మరియు సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కారించాలని టి.ఎస్.యూ.టి.ఎఫ్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన ప్రదర్శన చేసి జిల్లా కలెక్టర్ కు టీఎస్ యుటిఎఫ్ యాదాద్రి జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు ముక్కెర్ల యాదయ్య మెతుకు సైదులు,కేజీబీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ లక్ష్మి ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మూడు దశల పోరాటాలలో భాగంగా సోమవారం రోజు కేజీబీవీ,యుఆర్ఎస్ సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని,29 రోజుల సమ్మె కాలానికి వేతనాన్ని వెంటనే విడుదల చేయాలని,మినిమం టైం స్కేలు వర్తింపజేయాలని,కేజీబీవీ మహిళా ఉపాధ్యాయులకు చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేస్తూ,నైట్ డ్యూటీలను మినహాయింపు చేసి కేర్ టేకర్లను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈనెల 20 తారీకు లోపు ప్రభుత్వం స్పందించినట్లయితే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడతామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఏ.వెంకటాచారి,కేజీబీవీ జిల్లా కన్వీనర్ కే కవిత, యు.ఆర్.ఎస్ నాయకులు యాకయ్య,ఎస్.ఎస్.ఏ నాయకులు నాగార్జున,పాండు,స్వామి,టీఎస్ యుటిఎఫ్ నాయకులు సుదర్శన్ రెడ్డి,డి.వెంకన్న,డి.రవి,అంజయ్య,ఎల్లయ్య,సోమయ్య,వెంకటేష్,నరసింహ,వివిధ విభాగాల ఉపాధ్యాయులు,ఉద్యోగులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News