Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:32 AM

కేంద్ర బడ్జెట్ తో కార్మికులకు కష్టాలు,కార్పొరేట్ లకు పండగ

20-02-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు జె మల్లికార్జున్

భువనగిరి టౌన్: 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ కార్మిక వర్గాలకు తీవ్ర అన్యాయం చేసేదిగా, కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేదిగా ఉందని Centre of Indian Trade Unions (CITU) రాష్ట్ర ఉపాధ్యక్షులు జె మల్లికార్జున్ గారు విమర్శించారు. శుక్రవారం రోజున CITU యాదాద్రి భువనగిరి జిల్లా కమిటి సమావేశం జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్లికార్జున్ గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 53 లక్షల 47 వేల 315 కోట్లు బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పటికీ కార్మికులకు కేటాయించింది శూన్యం అన్నారు. బడ్జెట్‌లో ఉద్యోగ హామీ, అసంఘటిత రంగ కార్మికులు,కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమానికి తగిన కేటాయింపులు చేయలేదన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సరిపడ నిధులు కేటాయించకపోవడం వల్ల గ్రామీణ పేదల జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.అదే సమయంలో పెద్ద కార్పొరేట్ సంస్థలకు పన్ను రాయితీలు,ఉత్పత్తి ప్రోత్సాహకాలు, ప్రత్యేక ప్రోత్సాహక పథకాల ద్వారా వేల కోట్ల రూపాయల సబ్సిడీలు ఇవ్వడం ప్రజావ్యతిరేక చర్యగా అభివర్ణించారు. ప్రజల పన్ను డబ్బుతో కార్పొరేట్లను ప్రోత్సహించడం సరైంది కాదని,ఆ నిధులను ఉపాధి సృష్టి, కనీస వేతనాల పెంపు, పింఛన్లు మరియు సామాజిక భద్రతకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్మికుల కనీస వేతనం ₹26,000 గా నిర్ణయించాలని,కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేయాలని,నాలుగు లేబర్ కోడ్‌లను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ,సమగ్ర సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ బడ్జెట్ కార్మిక, రైతు, మధ్యతరగతి ప్రజల ఆశలను వమ్ము చేసిందని,దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడతామని తెలిపారు. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు బిజెపి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయించడంలో ఘోరంగా వైఫల్యం చెందారని విమర్శించారు. రైల్వేలు కానీ ఇతర ప్రాజెక్టులో కేటాయింపు లేకపోవడం వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు.బిజెపికి రాజకీయ స్వార్థం తప్ప తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి ఇష్టం లేదని విమర్శించారు. ఈ సమావేశంలో CITU జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి పాండు, మాయ కృష్ణ,జిల్లా సహాయ కార్యదర్శులు తుర్కపల్లి సురేందర్,గొరిగే సోములు, పైళ్ల గణపతి రెడ్డి, పొట్ట యాదమ్మ,చెక్క రమేష్,జిల్లా కమిటి సభ్యులు ఆదిమూలం నందీశ్వర్,గంధమల్ల మాతయ్య, బత్తుల దాసు,పోతరాజు జహంగీర్,తూటి వెంకటేష్,శ్రీరాములు,కసగోని లలిత, బుర్రు అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కేంద్ర బడ్జెట్ తో కార్మికులకు కష్టాలు,కార్పొరేట్ లకు పండగ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News