Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 10:00 AM

క్యాన్సర్‌ను ముందే గుర్తిస్తే ప్రాణాపాయం తగ్గింపు

26-03-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మూడు వందల మందికి ఉచిత నిర్ధారణ పరీక్షలు – ఎంఎస్ఆర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో శిబిరం

క్యాన్సర్‌ను తొలి దశలో గుర్తిస్తే నివారణ సులభమవుతుందని, అందుకోసం అవగాహనతో పాటు నిర్ధారణ పరీక్షలు కీలకమని ఎంఎస్ఆర్ విద్యాసంస్థల అధినేత కొల్లు మధుసూదన్ రావు, కొంగర భవాని ట్రస్టు అధ్యక్షుడు కొంగర రామచంద్రరావు తెలిపారు. కీ.శే. కొంగరి భవాని స్మారకార్థం, ఎంఎస్ఆర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి పరిశోధన సంస్థ సహకారంతో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం గురువారం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో ఉన్న ఎంఎస్ఆర్ కిడ్జ్ పాఠశాలలో ఈ శిబిరాన్ని ప్రారంభించి వారు మాట్లాడుతూ నేటి సమాజంలో క్యాన్సర్ ప్రమాదకర వ్యాధిగా మారిందన్నారు. చాలాసార్లు చివరి దశలోనే గుర్తించబడడంతో చికిత్స కష్టమై ప్రాణాపాయం పెరుగుతోందని తెలిపారు. ప్రారంభ దశలోనే గుర్తిస్తే తక్కువ ఖర్చుతో చికిత్స పొందవచ్చని చెప్పారు.

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి విభాగాధిపతి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అనుమానాస్పద గడ్డలు, మానని పుండ్లు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. క్యాన్సర్ లక్షణాలు మొదట్లో స్పష్టంగా కనిపించవని, ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకుంటే ముందస్తు గుర్తింపు సాధ్యమవుతుందని తెలిపారు.ముందస్తుగా నమోదు చేసుకున్న రెండు వందల మందితో పాటు మరో వందమందికి మొత్తం సుమారు మూడు వందల మందికి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఆర్ విద్యాసంస్థల ప్రతినిధి కొల్లు శ్రీనివాసరావు, చేతన ఫౌండేషన్ అధ్యక్షుడు సీతారామయ్య, వైద్యులు రవిశంకర్, శైలజ, మాన్విత, రేడియాలజీ నిపుణుడు ప్రభాకర్, నర్సింగ్ సిబ్బంది, సూర్యాపేట చందన నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

క్యాన్సర్‌ను ముందే గుర్తిస్తే ప్రాణాపాయం తగ్గింపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News