Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:27 AM

కుషాయిగూడ డిపో నుంచి సూపర్‌ లగ్జరీ బస్సులకు 15% రాయితీ

17-12-2025 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కుషాయిగూడ డిపో నుంచి సూపర్‌ లగ్జరీ బస్సులకు 15% రాయితీ

స్థానిక ప్రతినిధి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కుషాయిగూడ డిపో ఆధ్వర్యంలో కుషాయిగూడ ప్రాంత ప్రయాణికులకు శుభవార్త. సూపర్‌ లగ్జరీ బస్సు సర్వీసులపై 15 శాతం రాయితీ అమలు చేస్తున్నట్లు డిపో మేనేజర్ వేణుగోపాల్ బుధవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

ఈసీఐఎల్ కేంద్రంగా ప్రతిరోజూ పలు ముఖ్య రూట్లకు సూపర్‌ లగ్జరీ బస్సులు నడుస్తాయని ఆయన తెలిపారు. వివరాలివీ—

ఈసీఐఎల్ – తిరుపతి : సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరే బస్సు, చార్జీ రూ.960/-

ఈసీఐఎల్ – అమలాపురం : రాత్రి 7.00 గంటలకు బయలుదేరే బస్సు, చార్జీ రూ.880/-

ఈసీఐఎల్ – గుంటూరు : ఉదయం 8.00 గంటలకు, రాత్రి 9.20 గంటలకు బయలుదేరే బస్సులు, చార్జీ రూ.480/-

ఈసీఐఎల్ – కందుకూరు : రాత్రి 7.30 గంటలకు బయలుదేరే బస్సు, చార్జీ రూ.670/-

ఈ అన్ని సర్వీసులు ప్రతిరోజూ ఈసీఐఎల్ నుంచే నడుస్తాయని, కుషాయిగూడ ప్రాంత ప్రయాణికులకు 15 శాతం రాయితీ వర్తింపజేస్తున్నట్లు డిపో మేనేజర్ స్పష్టం చేశారు.

టికెట్ల బుకింగ్ కోసం TGSRTC ఆన్‌లైన్ ద్వారా లేదా బుకింగ్ కౌంటర్లలో, అవసరమైతే బస్సులో నేరుగా కూడా టికెట్ తీసుకుని ప్రయాణించే అవకాశం ఉందన్నారు. ప్రయాణికులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Sthanikam

కుషాయిగూడ డిపో నుంచి సూపర్‌ లగ్జరీ బస్సులకు 15% రాయితీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News