Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:30 PM

కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానం రద్దు చేయాలి - దేశ వ్యాప్త సమ్మెలో మున్సిపల్ కార్మికులు

కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానం రద్దు చేయాలి - దేశ వ్యాప్త సమ్మెలో మున్సిపల్ కార్మికులు

కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానం రద్దు చేయాలి - దేశ వ్యాప్త సమ్మెలో మున్సిపల్ కార్మికులు
February 12, 2026 05:02 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దుచేసి కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) జిల్లా కార్యదర్శి ఎండి సలీం సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య లు పిలుపునిచ్చారు. గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఉదయం ఐదు గంటలకు పారిశుధ్య పనులు నిలిపివేసి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దుచేసి తెచ్చిన నాలుగు లేబర్ కోళ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ థర్డ్ పార్టీ ఫిక్స్డ్ టర్మ్ పార్ట్ టైం డైలీ వేజ్ తదితర పేర్లతో కార్మికుల కష్టాన్ని దోచుకుంటుందని ఈ విధానాలన్నీ రద్దుచేసి కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు అప్పటిలోపు సమాన పనికి సమాన వేతనం అమలు జరపాలని విజ్ఞప్తి చేశారు కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దుచేసి కార్పొరేట్లకు అనుకూలంగా అవలంబిస్తున్న బిజెపి కేంద్ర ప్రభుత్వ విధానాలను కార్మిక వర్గం వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు వ్యవసాయ కార్మికుల రైతుల హక్కులను హరించి వేసే విధంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై రైతాంగం వ్యవసాయ కార్మికులు కార్మికులు పెద్ద ఎత్తున సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నల్లగొండ నల్లగొండ పట్టణంలో ఆర్టీసీలో ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ పవర్లూమ్స్ పద్మ నగర్ అర్జాల బావి ప్రాంతాలలో సమ్మె చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఎస్డబ్ల్యుఎఫ్ జిల్లా అధ్యక్షులు కందుల నరసింహ సహాయ కార్యదర్శి కే శ్యాంసుందర్ డిపో కార్యదర్శి గులాం రసూల్ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గంజి నాగరాజు కార్యదర్శి సూరపల్లి భద్రయ్య ఆర్జాలబాయి ఏరియా అధ్యక్షులు పెండెం బుచ్చి రాములు కార్యదర్శి దేవులపల్లి గిరిబాబు పవర్లూమ్ మహిళా అధ్యక్ష కార్యదర్శులు మూడో చంద్రకళ మిరియాల శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.

సిఐటియు పట్టణ కన్వీనర్ అవుట రవీందర్ అధ్యక్షతన జరిగిన సభలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చింతకాయల సంతోష్, పట్టణ కార్యదర్శి పెరిక కృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్ల సంజీవ, ఉపాధ్యక్షులు జీడిమెట్ల నరసింహ, సహాయ కార్యదర్శి పందుల లింగయ్య, పగిళ్ల రాములు, ఐ ఎన్ టి యు సి పట్టణ నాయకులు లతీఫ్, ఎర్ర శ్రీనివాస్, అండాలు, శ్రావణ్ కుమార్, రమేష్, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News