Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 09:57 AM

క్షయ వ్యాధి నిర్మూలనకు సమగ్ర చర్యలు

క్షయ వ్యాధి నిర్మూలనకు సమగ్ర చర్యలు

క్షయ వ్యాధి నిర్మూలనకు సమగ్ర చర్యలు
24-03-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లాలో క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించి క్షయ రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలుపునిచ్చారు.

ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలో గాంధీ పార్క్ నుండి ప్రభుత్వ వైద్య కళాశాల వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వైద్య కళాశాలలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ క్షయ వ్యాధి నివారణకు అవసరమైన అన్ని పరీక్షలు, చికిత్స సదుపాయాలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా రూ.20 లక్షల వ్యయంతో మొబైల్ ఎక్స్ రే యంత్రం ద్వారా జనవరి 2025 నుండి 52,901 మందికి పరీక్షలు నిర్వహించగా, 1,741 మందికి వ్యాధి నిర్ధారణ అయిందని, వారిలో 1,356 మంది పూర్తిగా కోలుకున్నారని తెలిపారు. ప్రస్తుతం 385 మంది చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.

ఇప్పటివరకు 21 గ్రామ పంచాయితీలను క్షయ ముక్త గ్రామాలుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. మరిన్ని గ్రామాలను క్షయ రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ క్షయ యోధులుగా పని చేయాలని సూచించారు.

క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించి లక్ష్యాలను చేరుకున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు లక్ష రూపాయల ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. జిల్లాలోని మూడు క్షయ కేంద్రాల అభివృద్ధికి మూడు లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించారు. క్షయ ముక్త గ్రామాలుగా నిలిచిన సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, వైద్య సిబ్బందిని ప్రశంసా పత్రాలతో సత్కరించారు.

కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి వెంకటరమణ, కార్యక్రమ అధికారి ప్రసీద్, వైద్యులు నాజియా తబస్సుమ్, గురురాజు, ఈశ్వరమ్మ, శ్రీకాంత్ భట్, జనార్ధన్, వెంకట పాపిరెడ్డి, ఉప వైద్య ఆరోగ్య అధికారులు చంద్రశేఖర్, మాధవ్ కుమార్, రెవెన్యూ అధికారి వేణు మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

క్షయ వ్యాధి నిర్మూలనకు సమగ్ర చర్యలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News