Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:54 PM

కారు గుర్తుకు మద్దతుగా ఖేడ్‌లో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం

05-02-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో నారాయణఖేడ్ పట్టణంలోని 7, 12, 13 వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి పాల్గొన్నారు. వారితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.ఈ సందర్భంగా 7వ వార్డు నుంచి అభ్యర్థిగా విజయ్ బుజ్జి, 12వ వార్డు నుంచి అభ్యర్థిగా పరశురాం, 13వ వార్డు నుంచి అభ్యర్థిగా మిట్టు కారు గుర్తుపై పోటీ చేస్తున్నారని ప్రజలకు వివరించారు.ఈ ముగ్గురు అభ్యర్థులకు మద్దతుగా నిలిచి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.ప్రచారంలో భాగంగా మాజీ శాసనసభ్యుడు మహారెడ్డి భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో తాను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో నారాయణఖేడ్ పట్టణ అభివృద్ధికి అనేక కీలక పనులు చేపట్టినట్లు గుర్తు చేశారు. గల్లి గల్లికి సిమెంట్ రోడ్లు నిర్మించామని, ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం కల్పించేందుకు నల్ల కనెక్షన్ల ద్వారా నీటిని అందించిన ఘనత తమకే దక్కుతుందని తెలిపారు.అదేవిధంగా పట్టణంలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయడంతో పాటు ఆక్సిజన్ పార్కును కూడా ఏర్పాటు చేశామని, దీంతో ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. భవిష్యత్తులోనూ నారాయణఖేడ్ అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు స్థాయి నాయకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా ప్రచారం కొనసాగుతుందని నాయకులు తెలిపారు.

Sthanikam

కారు గుర్తుకు మద్దతుగా ఖేడ్‌లో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News