Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 02:04 AM

కరాటే రాష్ట్ర ఏ గ్రేడ్ జడ్జిలుగా పేట కరాటే మాస్టర్లు

19-01-2026 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

200 మందితో పోటీపడి అర్హత సాధించిన సూర్యాపేట క్రీడాకారులు

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

కరాటే ఇండియా ఆర్గనైజేషన్ రాష్ట్ర ఏ గ్రేడ్ జడ్జిలుగా సూర్యాపేట పట్టణానికి చెందిన కరాటే మాస్టర్లు జె.వి. రమణ (చిన్న), ఆర్. సంతోష్ అర్హత సాధించారు. ఈ నెల 18న హైదరాబాద్ సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన కియో రిఫరీ, జడ్జి పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా రెండు వందల మంది కరాటే మాస్టర్లు పాల్గొనగా సూర్యాపేటకు చెందిన ఈ ఇద్దరు మాస్టర్లు విజయం సాధించడం విశేషం.ఈ సందర్భంగా కియో రాష్ట్ర కార్యదర్శి మళయాల రామస్వామి, కోశాధికారి మల్లికార్జున్, సుమన్ షోటోఖాన్ స్పోర్ట్స్ కరాటే డూ అకాడమీ వ్యవస్థాపకుడు జె. శ్రీనివాస్ చేతుల మీదుగా అర్హత పత్రాలను అందుకున్నారు. జడ్జి పరీక్షలో అర్హత సాధించిన కరాటే మాస్టర్లను కియో రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, సినీ హీరో సుమన్ అభినందించారు. సూర్యాపేట క్రీడారంగానికి ఇది గర్వకారణమని పలువురు క్రీడాభిమానులు ప్రశంసించారు.

Sthanikam

కరాటే రాష్ట్ర ఏ గ్రేడ్ జడ్జిలుగా పేట కరాటే మాస్టర్లు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News