Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం సిఐటియు ర్యాలీ

12-02-2026 110 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, కార్మికులను బానిసలుగా మారుస్తున్న నాలుగు లేబర్ కోడ్స్‌ను తక్షణమే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట నగేష్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెకు మద్దతుగా గురువారం చిట్యాలలో సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరైన జిట్ట నగేష్ మాట్లాడుతూ, కార్మికుల హక్కులను కుదించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న లేబర్ కోడ్స్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలని, కార్మికులకు కనీస వేతన చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజలు ఖండించాలని పిలుపునిచ్చారు.

ర్యాలీలో వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొని కార్మికుల సమస్యలపై సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో అరూరి శ్రీను, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, అంగన్వాడీ టీచర్ల యూనియన్ నాయకురాలు దాడి అరుణ, ఫైళ్ళ పద్మ, మిల్లు డ్రైవర్ల సంఘం నాయకులు ఏళ్ల మారయ్య, తిరుపతి, మున్సిపల్ వర్కర్స్ నాయకులు పాల లక్ష్మయ్య, జనపాల జ్యోతి, మేడి శోభ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు వడ్డేపల్లి శంకర్, సుక్క నర్సింహా, గ్రామ పంచాయతీ వర్కర్ నాయకులు మంకాల బాలమ్మ, సిరిపంగి యాదయ్య, సిపిఎం మండల నాయకులు బొబ్బిలి సుధాకర్ రెడ్డి, నెలికంటి నర్సింహా, కల్లూరి కుమార స్వామి, పంది నరేష్ తదితరులు హాజరయ్యారు.

సమ్మె సందర్భంగా కార్మికులు తమ డిమాండ్లతో నినాదాలు చేస్తూ పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమం శాంతియుతంగా ముగిసింది.

Sthanikam

కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం సిఐటియు ర్యాలీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News