Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:54 AM

కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రదర్శన

కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రదర్శన

కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రదర్శన
February 13, 2026 07:08 AM 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

సార్వత్రిక సమ్మే విజయవంతం అయ్యిందని ప్రకటించిన కార్మిక, ప్రజా సంఘాలకు చెందిన నేతలు.4 లేబర్ కోడ్లు, 3 రైతు వ్యతిరేక, విబిజీ రామ్ జీ, విత్తన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లు-2025 చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జవహర్ నగర్ జీహెచ్ఎంసి పరిధిలో కార్మిక, ప్రజా సంఘాలు ప్రదర్శనను నిర్వహించారు. 2026, ఫిభ్రవరి-12, గురువారం రోజు జరిగిన అఖిల భారత సమ్మెలో బాగంగా బాలాజీనగర్ లోని జీహెచ్ఎంసి కార్యాలయం ప్రధాన రహదారి మీదుగా మొదలైన ప్రదర్శన కోళ్ళఫారం బస్టాండ్ మీదుగా తిరిగి డాక్టర్ అంబేద్కర్, బాబుజగ్జీవన్ రావు విగ్రహాల బస్టాండ్ ప్రాంగణం వరకు సాగిన బారీ ప్రదర్శనలో 8 గంటల పనిధినం అమలు చేయాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమలను పరిరక్షించాలని, కనీస వేతనాలను అమలు చేయాలని, మతోన్మాదా, కార్పొరేట్ విధానాలు విడనాడాలని నినదించారు. ఆతర్వాత జరిగిన బహిరంగ కార్యక్రమంలో కేంద్రంలో బీజేపీ ప్రధాని నరేంద్రమోదీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తీవ్రంగా ఐ.ఎఫ్.టి.యు. షేక్ షావలి ఖండించారు. కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాల వలన ఆకలి, దారిద్ర్యం, నిరుద్యోగం లాంటి సమస్యలతో దేశ ప్రజలు తల్లడిల్లుతున్నారని సిఐటియు శివన్నారాయణ అన్నారు. సామ్రాజ్యవాదులకు, బడా కార్పొరేట్ సంస్థలకు దేశాన్ని తాకట్టుపెట్టే చర్యలు బావి తరాల వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని తెలంగాణ ఆదర్శ పంచాయతీ మరియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఇఫ్టూ శివబాబు ఎండగట్టారు. అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని మతతత్వ, కార్పొరేట్ విధానాలతో దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని ఏ.ఐ.ఎఫ్.టి.యు. వై.మల్లేష్, రాము మండిపడ్డారు. 4 వేల సంవత్సరాల వెనుకటి బానిస సమాజంలోకి నెట్టివేసే బ్రాహ్మణీయ మనువాద విధానాలతో భారత రాజ్యాంగ స్పూర్తిని, ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తున్నారని పిఓడభ్ల్యూ(విముక్తి) పెర్క సునీత ఆరోపించారు. ప్రజల మౌలిక సమస్యలను పక్కదారి పట్టించెందుకు ఆర్ఎస్ఎస్ లాంటి మెజారిటీ మతోన్మాదా వాదులచే నిత్యం ఏదో ఒక మూల మైనారిటీ మతాలపై , ఆదివాసి, దళితులపై దాడులు, దౌర్జన్యాలు కొనసాగిస్తున్నారని పీఓడభ్ల్యూ జయసుధ ఎత్తిచూపారు. మరో శ్రీలంక, బంగ్లా, నేపాల్, భూటాన్ లాంటి దేశాల సంక్షోభంలోకి దేశాన్ని నెట్టే ప్రయత్నాలను అన్నివర్గాల ప్రజలు ఐక్యంగా ఉద్యమించి, తిప్పికొట్టాలని అసంఘటిత కార్మిక సంఘం ఎస్.కే.మీరా పిలుపునిచ్చారు. ఇప్పటికైన కేంద్ర ప్రభుత్వం తన అప్రజాస్వామిక, ఫాసిస్టు నియంత్రుత్వ పోకడలను విడనాడాలని భవన నిర్మాణ కార్మిక సంఘం చెన్నాపురం యాదన్న డిమాండ్ చేశారు. లేని యెడల ప్రజా ఆగ్రహాన్ని చవిచూసే రోజులు వస్తాయని ఈ సందర్భంగా బీజేపీ ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని వికలాంగుల కాలనీ భూడిద వెంకటేష్, భవన నిర్మాణ సంఘం కొయ్యాడ వెంకటేష్, సిఐటియు డి.నాగేష్, బాలు, తెలంగాణ కళాకారుల వేదిక టి.రాణి, ఫాతిమా, బాలమణి, పద్మ తదితరులు ఈపై కార్యక్రమంలో పాల్గొని హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News