Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 03:55 AM

కార్మిక నేత సాయి కుమార్‌ను గెలిపించాలి

కార్మిక నేత సాయి కుమార్‌ను గెలిపించాలి

కార్మిక నేత సాయి కుమార్‌ను గెలిపించాలి
08-02-2026 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సిపిఎం జిల్లా నాయకులు మట్టిపల్లి సైదులు పిలుపు

సూర్యాపేట పట్టణంలోని 24వ వార్డు సిపిఎం అభ్యర్థి, కార్మిక నేత వల్లపు దాసు సాయి కుమార్‌ను గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు పిలుపునిచ్చారు. ఆదివారం 24వ వార్డులో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ఆయన ప్రజలను అభ్యర్థించారు.ఈ సందర్భంగా మట్టిపల్లి సైదులు మాట్లాడుతూ, 24వ వార్డు అభివృద్ధి కమ్యూనిస్టుల ద్వారానే సాధ్యమని అన్నారు. అవినీతి రహిత పాలన కావాలంటే సిపిఎం అభ్యర్థికి ఓటు వేయాల్సిన అవసరం ఉందన్నారు. వార్డులో అనేక సమస్యలు పేరుకుపోయాయని, అవి పరిష్కారం కావాలంటే ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసే నాయకులను గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పారు.సిపిఎం అభ్యర్థి సాయి కుమార్ గెలిస్తే మున్సిపల్ కౌన్సిల్‌లో వార్డు సమస్యలపై గళం విప్పి పోరాడతారని తెలిపారు. కార్మిక నాయకుడిగా గత ఇరవై సంవత్సరాలుగా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు నిర్వహించిన వ్యక్తి సాయి కుమార్ అని గుర్తు చేశారు. అలాగే వెనుకబడిన శివారు ప్రాంతాల అభివృద్ధి కోసం అలుపెరుగని ప్రజా ఉద్యమాలు చేపట్టారని అన్నారు.ఈ నేపథ్యంలో ప్రజలు సాయి కుమార్‌కు ఒకసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎలుగూరి గోవిందు, ధనియాకుల శ్రీకాంత్, మద్దెల జ్యోతి, వీరబోయిన రవి, శ్రీను, సిపిఎం పట్టణ నాయకులు బొమ్మిడి లక్ష్మీనారాయణ, అబ్బగాని బిక్షం, షేక్ సైదులు, ఎలుగూరి ఆశాలు, దశరథ, కవిత, రేణుక తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కార్మిక నేత సాయి కుమార్‌ను గెలిపించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News