Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:22 AM

కార్మిక నేత బి.టి. రణదివె ఆశయాలను కొనసాగిద్దాం..

06-04-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

సిఐటియు యాదాద్రి జిల్లా కమిటి

భువనగిరి:భారత కార్మిక వర్గ పోరాట యోధుడు,సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బి.టి.రణదివె గారి 36వ (బిటీఆర్) వర్ధంతి కార్యక్రమాన్ని భువనగిరి సిఐటియు జిల్లా కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి,కల్లూరి మల్లేశం పాల్గొని బి.టి.ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..."బి.టి. రణదివె గారు కేవలం ఒక నాయకుడే కాదు,కార్మిక వర్గానికి ఒక సిద్ధాంతకర్త అని,దేశంలో కార్మిక హక్కుల కోసం,దోపిడీ లేని సమాజం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదనీ,నేడు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ప్రస్తుత పాలకులు కార్మిక చట్టాలను యజమానులకు అనుకూలంగా మారుస్తున్నారని,29 చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మికులను బానిసలుగా చేస్తున్నారని విమర్శించారు.బి.టి.ఆర్ పిలుపునిచ్చిన'ఐక్యత మరియు పోరాటం'అనే నినాదంతోనే కార్మిక లోకం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాలు,సామాజిక భద్రత కల్పించే వరకు సిఐటియు పోరాటాన్నిఉధృతం చేస్తుందని హెచ్చరించారు.​ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దాసరి పాండు,మాయ కృష్ణ,జిల్లా కమిటీ సభ్యులు గంధమల్ల మాతయ్య,ప్రజా సంఘాల నాయకులు దయ్యాల నరసింహ,వనం రాజు,చింతల శివ,బందెల ఎల్లయ్య,సుందర్,కవిత,దనమ్మ,శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కార్మిక నేత బి.టి. రణదివె ఆశయాలను కొనసాగిద్దాం..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News