Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:17 AM

కార్మిక హక్కులను హరిస్తున్న బీజేపీ: నర్సింహ

02-05-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పోచంపల్లి,: కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తోందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ విమర్శించారు. మేడే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని కార్మికులు, కర్షకులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

శుక్రవారం పోచంపల్లిలో నిర్వహించిన 140వ మేడే ఉత్సవాల సందర్భంగా సిఐటియు మండల, పట్టణ కమిటీల ఆధ్వర్యంలో కార్యాలయం నుంచి మహాత్మా గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సింహ మాట్లాడుతూ, 1886లో అమెరికాలోని చికాగోలో 8 గంటల పనిదినం కోసం కార్మికులు చేసిన పోరాట ఫలితంగానే ప్రపంచవ్యాప్తంగా కార్మిక హక్కులు సాధ్యమయ్యాయని తెలిపారు.

అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా 12 గంటల పనిదినం అమలు చేసే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్స్‌తో పాటు వివిధ చట్ట సవరణల ద్వారా కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీల జీవనోపాధిపై ప్రభావం చూపుతున్నాయని అన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరచడం వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని, పేదలు మరింత పేదవారిగా మారుతున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి సిఐటియు మండల కన్వీనర్ మంచాల మధు, పట్టణ కన్వీనర్ వడ్డేపల్లి యాదగిరి అధ్యక్షత వహించగా, రైతు సంఘం నాయకులు, డివైఎఫ్ఐ ప్రతినిధులు మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు

Sthanikam

కార్మిక హక్కులను హరిస్తున్న బీజేపీ: నర్సింహ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News