Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

కర్ల రాజేష్ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం......

Updated : 29 Jan 2026 14:39 IST
As Preferred Source 1 min read
కర్ల రాజేష్ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం......

కర్ల రాజేష్ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం......

కర్ల రాజేష్ కుటుంబానికి ఈడబ్ల్యూఎస్ సొసైటీ అండగా ఉంటుంది......

కోదాడ ప్రతినిధి హరీష్

సమాజంలో అట్టడుగు, అణగారిన వర్గాల అభివృద్ధికి ఈడబ్ల్యూఎస్ సొసైటీ నిరంతరం కృషి చేస్తుందని ఆ సంస్థ వైస్ చైర్మన్ శ్రీనివాస్ బహదూర్ తెలిపారు. కోదాడ పట్టణంలో ఇటీవల మృతి చెందిన దళిత యువకుడు కర్ల రాజేష్ నివాసానికి సొసైటీ వ్యవస్థాపకులు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ఆదేశాల మేరకు వెళ్లి రాజేష్ తల్లి లలితమ్మకు తక్షణ సహాయం కింద లక్ష రూపాయల చెక్కును అందజేశారు. రాజేష్ కుటుంబనికి భవిష్యత్తులో కూడా తమ సంస్థ ద్వారా అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలకు, అభాగ్యులకు తమ సంస్థ అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ట్రజరర్ కడమంచి సహదేవ్, ఈసీ మెంబర్లు మొహమ్మద్ ఖాజా మొయినుద్దీన్, నరేష్, స్థానిక నాయకులు ఏపూరి రాజు, గంధం యాదగిరి, కుడుముల లక్ష్మీనారాయణ, కాంపాటి పుల్లయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.....

Sthanikam

కర్ల రాజేష్ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం......

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news