Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:49 PM

కర్ల రాజేష్ హత్యకు న్యాయం చేయాలి

కర్ల రాజేష్ హత్యకు న్యాయం చేయాలి

కర్ల రాజేష్ హత్యకు న్యాయం చేయాలి
January 18, 2026 08:35 PM 103 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

లాకప్ మృతికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

న్యాయం జరిగేవరకు ఉద్యమం ఆగదు – ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ రాష్ట్ర కార్యవర్గం హెచ్చరిక

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

కర్ల రాజేష్ లాకప్ మృతి ఘటనకు కారకులైన పోలీసులపై, సంబంధిత అధికారులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, అనుబంధ సంఘాల తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సూర్యాపేటలోని జే కన్వెన్షన్ హాల్‌లో జరిగింది. భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ సమావేశానికి ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగ అధ్యక్షత వహించారు. సమావేశానికి పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టె జానయ్య యాదవ్ పాల్గొని ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా వట్టె జానయ్య యాదవ్ మాట్లాడుతూ కర్ల రాజేష్ మృతి అత్యంత బాధాకరమైన ఘటనగా పేర్కొన్నారు. ఇది కేవలం ఒక వ్యక్తి మరణం కాదని, దళిత–బహుజన సమాజం ఎదుర్కొంటున్న వ్యవస్థాగత అణచివేతకు ప్రతీకగా మారిందన్నారు. ఇలాంటి అమానవీయ ఘటనలు ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లోనే జరుగుతున్నాయని, అగ్రకులాలకు చెందిన వారిపై ఇటువంటి ఘటనలు అరుదని విమర్శించారు.

చట్టాలు బడుగు బలహీన వర్గాలకు ఒకలా, అగ్రకులాలకు మరోలా పనిచేస్తున్నాయనే వాస్తవాన్ని సమాజం గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. మూడు శాతం కూడా లేని అగ్రకులాల ఆధిపత్యానికి ఓట్లు వేసి, ఎస్సీ–ఎస్టీ–బీసీ–మైనారిటీ వర్గాలు బానిసలుగా జీవించడం తగదని స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాలకు నిజమైన న్యాయం జరగాలంటే ఈ వర్గాలన్నీ ఐక్యమై మన ఓట్లు మనవాళ్లకే వేయాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. రాజకీయ చైతన్యం ద్వారానే దోపిడీ వ్యవస్థకు చెక్ పెట్టవచ్చని అన్నారు. కర్ల రాజేష్‌కు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని సమావేశంలో పాల్గొన్న నాయకులు స్పష్టం చేశారు.ఈ సమావేశంలో సూర్యాపేట జిల్లా ఇంచార్జి బచ్చలకూల వెంకటేశ్వర్లు, ఎంఎస్పీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఇంజం వెంకటస్వామి మాదిగ, ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు సీహెచ్ సోమశేఖర్ మాదిగ, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సందే కార్తీక్ మాదిగ, బొజ్జ సైదులు, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు యాతకుల రాజన్న మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చింత వినయ్ మాదిగ, చింతలపాటి చిన్న శ్రీరాములు మాదిగ, ఎర్ర వీరస్వామి మాదిగ, రవి కిరణ్, కోదాడ ఇంచార్జి ఏర్పూర్ రాజు, కొండపల్లి ఆంజనేయులు, ఎంఎస్ఎఫ్ సూర్యాపేట జిల్లా కన్వీనర్ నవీన్ మాదిగతో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ సూర్యాపేట జిల్లా మహిళా అధ్యక్షురాలు కొన్నే మంజుల, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి నారాయణదాసు కవిత, జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, ప్రధాన కార్యదర్శి మల్లేష్, పెన్ పహాడ్ మండల అధ్యక్షుడు ఆవుల అంజయ్య, ఆత్మకూరు మండల అధ్యక్షుడు బొల్లె సైదులు, నెలచర్ల మధు, పిడమర్తి ఉపేందర్, కోటేష్, గుంటూరు విజయ్, మహేష్, కడియం వంశీ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News