Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:16 PM

క్రిస్మస్ రోజే రాజ్యాంగ ప్రాథమిక హక్కులపై దాడులు – మౌనంగా ప్రభుత్వాలు

27-12-2025 87 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

క్రిస్మస్ రోజే రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన – మతోన్మాద దాడులపై ఆవేదన

సూర్యాపేట, స్థానికం ప్రతినిధి

క్రిస్మస్ పండుగ రోజునే భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను మతోన్మాద శక్తులు కాలరాస్తున్నాయని తెలంగాణ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిషప్ దుర్గం ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు.

శనివారం సూర్యాపేట పట్టణంలోని నల్లాల బావి సెంటర్, ఏపూర్ బస్టాండ్ వద్ద సూర్యాపేట నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు రెవ. జలగం జేమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం ఆర్టికల్స్ 25 నుంచి 28 వరకు ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛను హామీ ఇస్తున్నాయని, అయినా గత పదేళ్లుగా దేశవ్యాప్తంగా క్రైస్తవులపై, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో మహిళలు, చర్చిలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు.

ఈ దాడులను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, రాజకీయ పార్టీలు, మేధావులు, మీడియా మౌనం పాటించడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. మతం పేరుతో యువతను దారి మళ్లిస్తూ దేశ అభివృద్ధిని ప్రమాదంలోకి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా లౌకిక భారతాన్ని కాపాడేందుకు అందరూ స్పందించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆర్చ్ బిషప్ ఎం.పి.హెచ్.హెచ్. మోజెస్, రెవ. బొక్క ఏలీయా రాజు, పాస్టర్ వరికుప్పల మత్తయి, రెవ. పంది మార్కు, పాస్టర్ బానోత్ సుధాకర్, రెడ్డిపల్లి ప్రేమ్ సాగర్, పుల్లూరు బోయాజ్, ధరవత్ మంగ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

క్రిస్మస్ రోజే రాజ్యాంగ ప్రాథమిక హక్కులపై దాడులు – మౌనంగా ప్రభుత్వాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News