Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:18 PM

కార్ రేసుల్లా మారిన హైవే చిట్యాల పరిధిలో ప్రమాదాలు

18-01-2026 316 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమ్మిడాల మహేందర్ రెడ్డి

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై హైస్పీడ్ హడావుడి.. వరుస ప్రమాదాలు

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారిపై ఆదివారం తీవ్ర వాహన రద్దీ నెలకొంది. హైవేపై కార్ రేసుల్ని తలపించేలా కొందరు డ్రైవర్లు మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం కలకలం రేపింది. ఈ క్రమంలో నల్గొండ జిల్లా చిట్యాల శివారులో వరుసగా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

చిట్యాల శివారులో ఒకదానికొకటి తాకుతూ మూడు కార్లు వరుసగా ఢీకొన్నాయి. అధిక వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనతో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. అదే సమయంలో చిట్యాల టౌన్ పరిధిలో మరో కారు డివైడర్‌ను ఢీకొనడంతో హైవేపై భయానక దృశ్యాలు కనిపించాయి.

ప్రమాదాల్లో కార్లు తీవ్రంగా ధ్వంసమైనప్పటికీ ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదాలకు కారణమైన వాహనాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హైవేపై తరచూ జరుగుతున్న ఇలాంటి ఘటనలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేగ నియంత్రణ చర్యలు కఠినంగా అమలు చేయాలని, పటిష్టమైన పోలీస్ పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ ప్రాణాలకు ముప్పు అని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Sthanikam

కార్ రేసుల్లా మారిన హైవే చిట్యాల పరిధిలో ప్రమాదాలు

Article Image

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News