Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:39 AM

కోర్టుల భారం తగ్గించిన లోక్‌ అదాలత్‌… రామన్నపేటలో 481 కేసులు పరిష్కారం

21-12-2025 247 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

లోక్‌ అదాలత్‌తో న్యాయ పరిష్కారం… 481 కేసులకు ముగింపు

రామన్నపేట, స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట కోర్టు పరిధిలో నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో మొత్తం 481 కేసులు పరిష్కారమై కక్షిదారులకు న్యాయసంతృప్తి లభించింది. ఆదివారం కోర్టు హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జ్ జి. సబిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శిరీష, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి డి. సత్తయ్యలు పాల్గొని కేసుల పరిష్కార ప్రక్రియను పర్యవేక్షించారు.

రామన్నపేట జ్యుడిషియల్ పరిధిలోని రామన్నపేట, వలిగొండ, మోత్కూరు, అడ్డగుడూరు పోలీస్ స్టేషన్‌లకు సంబంధించిన కేసుల్లో క్రిమినల్ కేసులు 112, ప్రీ లిటిగేషన్ కేసులు 2, బ్యాంక్ కేసులు 9, ఇతర పిట్టి కేసులు 358ను ఇరు పక్షాల పరస్పర అంగీకారంతో పరిష్కరించారు. ముఖ్యంగా బ్యాంక్ కేసుల ద్వారా రూ. 5,95,169/- మొత్తాన్ని రికవరీ చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా జడ్జీలు మాట్లాడుతూ, క్షణిక ఆవేశాలతో కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరగడం వల్ల సమయం, ధనం వృథా అవుతాయని, అలాంటి పరిస్థితుల్లో లోక్‌ అదాలత్‌ రాజమార్గమే యాజమార్గం అని పేర్కొన్నారు. కోర్టు పరిధిలో నిర్వహించే లోక్‌ అదాలత్‌లను వినియోగించుకొని సమస్యలను సులభంగా, శాశ్వతంగా పరిష్కరించుకోవాలని కక్షిదారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో అడ్వకేట్లు, పలు మండలాల ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్లు, వివిధ పోలీస్ స్టేషన్‌ల సిబ్బంది, కోర్టు సిబ్బంది, లీగల్ సర్వీసెస్ టీమ్ సభ్యులు బత్తుల గణేష్, కానుగంటి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కోర్టుల భారం తగ్గించిన లోక్‌ అదాలత్‌… రామన్నపేటలో 481 కేసులు పరిష్కారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News