Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:28 AM

కూలిన ఇల్లు మట్టి, చెట్ల తొలగింపుతో రాకపోకలు పునరుద్ధరణ

22-12-2025 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజా సమస్యకు తక్షణ పరిష్కారం… 23వ వార్డులో మట్టి తొలగింపు

స్థానిక ప్రతినిధి రామన్నపేట కొండ మల్లేశం గౌడ్

భువనగిరి పట్టణంలోని 23వ వార్డులో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న సమస్యకు తక్షణ పరిష్కారం లభించింది. బ్రాహ్మణవాడ శివాలయం గల్లీలో పురాతనమైన ఇల్లు కూలి, రోడ్డుపై భారీగా మట్టి పేరుకుపోవడంతో పాటు పిచ్చి చెట్లు రోడ్డుకు అడ్డుగా రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈ విషయం తెలుసుకున్న మాజీ 23వ వార్డు కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ వెంటనే స్పందించి, సమస్యను మున్సిపల్ కమిషనర్ రామలింగం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది, జెసిబి సహాయంతో రోడ్డుపై పేరుకుపోయిన మట్టిని, చెట్లను తొలగించారు. దీంతో ప్రజల రాకపోకలకు ఏర్పడిన ఆటంకం తొలగిపోయి, స్థానికులు ఊరట పొందారు.

ఈ సందర్భంగా పడిగెల రేణుక ప్రదీప్ మాట్లాడుతూ, శిథిలావస్థలో ఉన్న పురాతన ఇళ్ల యజమానులు ముందస్తు జాగ్రత్తగా వాటిని కూల్చివేసి చుట్టుపక్కల ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు. అలాగే ఓపెన్ ప్రైవేట్ ప్లాట్ల యజమానులు తమ స్థలాల్లో పిచ్చి చెట్లు, మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించి శుభ్రంగా ఉంచాలని సూచించారు. ఖాళీ స్థలాల్లో చెత్త, వ్యర్థాలు వేయడం వల్ల పాములు, క్రిమికీటకాలు సంచరించి ప్రజలకు ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కేమోజు మల్లికార్జున్, సులోచన, పార్వతమ్మ, శారద, రంగమ్మ, జయమ్మ, శేషు, విష్ణు, వరుణ్ తేజ్, ప్రణయ్, పట్నం వేణు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కూలిన ఇల్లు మట్టి, చెట్ల తొలగింపుతో రాకపోకలు పునరుద్ధరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News