Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:48 AM

కొమ్మినేపల్లి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

28-12-2025 111 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఖమ్మం స్థానికం ప్రతినిధి

జడ్పీ ఎస్‌ఎస్ కొమ్మినేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఖమ్మం యూటీవైఎఫ్‌లో ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. 1991–92 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థులంతా ఒకే వేదికపై చేరి, విద్యాభ్యాస దశలోని మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

ఈ సందర్భంగా సభాముఖంగా తమ కష్టసుఖాలను పంచుకుంటూ, అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు. కుటుంబ సభ్యులను పరిచయం చేస్తూ, తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో సమ్మేళనం ఉత్సాహంగా కొనసాగింది.

ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పి. నాగేశ్వరావు, జె. సూర్యమ్మ, ఏ. ఉదయలక్ష్మి, యం. కృష్ణ ప్రసాద్, మురళి, జి. రాజశేఖర్, కే. ప్రభాకర్, హెచ్. భద్రు, కే. మాదారయ్య, వెంకటరమ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కొమ్మినేపల్లి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News