Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:18 AM

కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

13-12-2025 88 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అందుబాటులో ఉండే నాయకులకు అవకాశం ఇవ్వండి

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రామన్నపేట పట్టణంలో అభివృద్ధి పూర్తిగా శూన్యమైందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం రామన్నపేటలో సీపీఎం పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మిర్యాల మల్లేశానికి మద్దతుగా నిర్వహించిన ప్రచార రోడ్‌షోలో ఆయన పాల్గొని మాట్లాడారు.

కాంగ్రెస్ హయాంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుకాలేదని, మౌలిక సదుపాయాల కల్పనలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పట్టణ అభివృద్ధికి స్పష్టమైన దృష్టికోణం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ పరిస్థితి మారాలంటే ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన సీపీఎం బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మిర్యాల మల్లేశాన్ని ‘బ్యాటు’ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నిజాయితీతో సేవ చేసే నాయకుడిగా మల్లేశం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి మిర్యాల మల్లేశంతో పాటు నాయకులు బందెల రాములు, గొరిగె నర్సింహ, పోతరాజు సాయి, ఎండీ ఆమేర్, కందుల హన్మంత్, బావండ్లపల్లి బాలరాజు, ఎస్కే చాంద్, వేమవరపు సుధీర్ బాబు, బాసాని రాజు, కల్లూరి నరేష్, మునుకుంట్ల లెనిన్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News