Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:26 AM

కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లోకి వెళ్లడంతో సర్పంచిగా భారీ మెజార్టీ

14-12-2025 254 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట మండలం బోగారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో BRS బలపరిచిన అభ్యర్థి కూనూరు సాయికుమార్ గౌడ్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గంపల రామచంద్రారెడ్డిపై స్పష్టమైన ఆధిక్యంతో సాయికుమార్ గౌడ్ జయకేతనం ఎగరవేశారు.

ఎన్నికలకు ముందు చివరి నిమిషంలో కాంగ్రెస్ నేతలు సరైన మద్దతు ఇవ్వకపోవడంతో సాయికుమార్ గౌడ్ BRSలో చేరినట్లు తెలిసింది. పార్టీ మారినప్పటికీ గ్రామ ప్రజలు ఆయనకు అండగా నిలవడం విశేషం. అభివృద్ధి, స్థానిక సమస్యలపై స్పష్టమైన హామీలతో ప్రజలను ఆకట్టుకున్న సాయికుమార్ గౌడ్ వైపే ఓటర్లు మొగ్గుచూపినట్లు ఫలితాలు వెల్లడించాయి.

ఇదిలా ఉండగా, ఇక్కడ ఎమ్మెల్యే వీరేశం ఏర్పాటు చేసిన కమిటీ గంపల రామచంద్రారెడ్డిని నామినేట్ చేసినట్లు సమాచారం. అయితే క్షేత్రస్థాయిలో అసంతృప్తి, నాయకత్వ లోపం కాంగ్రెస్‌కు నష్టంగా మారినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ఫలితం రామన్నపేట రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తుందని చర్చ సాగుతోంది.

Sthanikam

కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లోకి వెళ్లడంతో సర్పంచిగా భారీ మెజార్టీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News