Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:43 AM

కాంగ్రెస్ కు అండగా నిలవాలి ఎమ్మెల్యే వేముల వీరేశం

13-12-2025 94 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేటను అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలుపుతా

రామన్న పేట స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేటను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలుపుతానని ఎమ్మెల్యే వేముల వీరేశం భరోసా ఇచ్చారు. శుక్రవారం రామన్నపేటలో సీపీఐ–కాంగ్రెస్ పార్టీలు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గరిక సత్యనారాయణకు మద్దతుగా నిర్వహించిన ప్రచార రోడ్‌షోలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

గ్రామాల సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్న ఎమ్మెల్యే, రానున్న రోజుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రామన్నపేటను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు.

నేను పక్కా లోకల్ ఇక్కడే ఉంటా సేవ చేస్తా

ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి గరిక సత్యనారాయణ మాట్లాడుతూ, నేను పక్కా లోకల్ ఇక్కడే ఉండి ప్రజలకు సేవ చేస్తాన ని గ్రామంలోని నాలుగు దిక్కులా స్వంత నిధులతో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ఉచితంగా మంచినీరు అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే గ్రామదేవతల ఆలయాల పునఃనిర్మాణానికి చర్యలు తీసుకుంటానని, గరిక ఫౌండేషన్ ద్వారా పేదలు, ఆపన్నులకు తగిన సహకారం అందిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాసం, నాయకులు ఊట్కూరి నర్సింహ, ఎండీ జమీర్ుద్దీన్, వనం చంద్రశేఖర్, గోదాసు పృథ్వీరాజ్, జెల్ల వెంకటేశం, ఎండీ అక్రం, శ్రీమన్నారాయణ, గుత్తా నరసింహారెడ్డి అబ్రహం కుమార్, గొలుసుల ప్రసాద్, కోట సుధాకర్ మోటె రమేష్, లెంకల ప్రవీణ్, కొమ్ము శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కాంగ్రెస్ కు అండగా నిలవాలి ఎమ్మెల్యే వేముల వీరేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News