Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:26 AM

కలుషిత నీరే తాగునీరు. రోగాల బారిన పడుతున్న ప్రజలు

23-05-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మిషన్ భగీరథ నీరు అందించి సమస్య పరిష్కరించాలి

మామునూరులో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన

ఎర్రుపాలెం, మామునూరు గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారిందని, కలుషిత నీరు సరఫరా కావడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని సీపీఎం మండల కార్యదర్శి మద్దాల ప్రభాకరరావు ఆరోపించారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో గ్రామస్తులు శనివారం ఆందోళన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు సరఫరా అయ్యేదని, అయితే గత ఎనిమిది నెలలుగా నీటి సరఫరా నిలిచిపోయిందన్నారు. ప్రస్తుతం పశువులు సేదతీరే మామునూరు పేట చెరువు నీటిని శుద్ధి చేయకుండా నేరుగా గ్రామ ట్యాంకుకు ఎక్కించి ప్రజలకు సరఫరా చేస్తున్నారని విమర్శించారు.

నీటిలో జలగాలు, పాచి, బురద మురుగు ఉండటంతో దుర్వాసన వస్తోందని, ఆ నీటిని తాగడం వల్ల గ్రామస్థులు జీర్ణకోశ, చర్మవ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి వైద్యం చేయించుకున్నా మళ్లీ అనారోగ్య సమస్యలు వస్తున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.

ప్రభుత్వం, సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వీడి వెంటనే స్వచ్ఛమైన సురక్షితమైన తాగునీరు అందించాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

అనంతరం గ్రామ సర్పంచ్ షేక్ పెద్దబాబు సాహెబ్, ఉపసర్పంచ్ మారబత్తుల ఆదిలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి నరేంద్రరెడ్డికి గ్రామస్థుల సంతకాలతో కూడిన వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో షేక్ లాల్ సాహెబ్, కన్నేబోయిన శ్రీనివాసరావు, షేక్ కరీం, బేతు శ్రీను, వేల్పుల స్వామి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కలుషిత నీరే తాగునీరు. రోగాల బారిన పడుతున్న ప్రజలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News