Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:12 PM

కలీల్పూర్‌లో పట్టపగలు చోరీ కేసు ఛేదన.. మూడు రోజుల్లోనే నిందితుడి అరెస్ట్

01-02-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

న్యాల్కల్ మండల పరిధిలోని కలీల్పూర్ గ్రామంలో పట్టపగలు జరిగిన ఇంటి చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థాన రిమాండ్‌కు తరలించినట్లు జహీరాబాద్ రూరల్ సిఐ జక్కుల హన్మంతు తెలిపారు.

వివరాల్లోకి వెళితే…

తేదీ 27-01-2026 న కలీల్పూర్ గ్రామానికి చెందిన జైపాల్ రెడ్డి మరియు సూరప్పల ఇళ్లలో పట్టపగలు చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి వారి ఇళ్లలోకి చొరబడి బంగారు ఆభరణాలు మరియు కొంత నగదును దొంగలించి పరారైనట్లు బాధితులు ఫిర్యాదు చేయగా,హద్నూర్ పోలీసు స్థావరంలో కేసు నమోదు చేయబడింది.

ఈ కేసును అత్యంత ప్రాధాన్యతతో తీసుకున్న జహీరాబాద్ రూరల్ సిఐ జక్కుల హన్మంతు ఆదేశాల మేరకు, హద్నూర్ పోలీసు స్థావర ఉప పరిశీలకుడు దోమ సుజీత్ తన సిబ్బందితో కలిసి చాకచక్యంగా దర్యాప్తు చేపట్టి కేవలం మూడు రోజుల వ్యవధిలోనే కేసును ఛేదించారు.

తేదీ 01-02-2026 న ఉదయం గంగ్వార్ కూడలి సమీపంలో స్థానిక ఎస్సై దోమ సుజీత్ తన సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, ఒక ఆటో వాహనం అతివేగంగా వస్తూ పోలీసులను గమనించి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అనుమానం వచ్చిన పోలీసులు ఆ వాహనాన్ని వెంబడించి పట్టుకుని విచారణ చేపట్టగా,అతడు కలీల్పూర్ గ్రామంలో జరిగిన ఇంటి చోరీకి తానే పాల్పడినట్లు అంగీకరించాడు.నిందితుడి వద్ద నుంచి దొంగిలించిన రెండున్నర తులాల బంగారు ఆభరణాలు, వెయ్యి రూపాయల నగదు మరియు చోరీకి ఉపయోగించిన ఆటో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థాన రిమాండ్‌కు తరలించారు.

Sthanikam

కలీల్పూర్‌లో పట్టపగలు చోరీ కేసు ఛేదన.. మూడు రోజుల్లోనే నిందితుడి అరెస్ట్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News