Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:14 PM

కల్వర్టు లేకుండా ఎన్ హెచ్ -65 రోడ్డు పనులు.. వరద ముప్పుపై ప్రజల్లో ఆందోళన

01-04-2026 215 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎన్ హెచ్-65 రోడ్డు మరమ్మతుల పనుల నేపథ్యంలో వరద ముంపు సమస్యపై కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి చౌటుప్పల్ చెరువు నుంచి 19వ వార్డు, గాంధీ పార్క్ పెద్ద డ్రైనేజ్ మీదుగా వెల్కమ్ టీ ప్యాలెస్ పక్క గల్లీ ద్వారా వచ్చే నాలా నీటి ప్రవాహంపై జరిగిన చర్చలో ముఖ్యమైన విషయం వెల్లడైంది. రోడ్డు నిర్మాణంలో భాగంగా కల్వర్టు ఏర్పాటు తమ ప్రణాళికలో లేదని, అలాగే కాంట్రాక్ట్‌లో కూడా ఆ అంశం లేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో వరద ముంపు సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో 19వ వార్డు కౌన్సిలర్ మధుసూదన్, 12వ వార్డు ప్రజలు, 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ గౌడ్, అలాగే 13వ వార్డు ప్రజలు ప్రత్యేకంగా స్పందించాల్సిన అవసరం ఉందని సూచించారు. ముఖ్యంగా బస్టాండ్ నుంచి శ్రీనివాస థియేటర్ వరకు సర్వీస్ రోడ్డులో ఉన్న వ్యాపారులు, స్థానిక నివాసితులు ఈ సమస్యపై ఏకమవ్వాలని పిలుపునిచ్చారు.ఈ సమస్యను స్థానిక చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ ద్వారా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, రోడ్డు నిర్మాణంలో భాగంగా కల్వర్టు ఏర్పాటు చేయాలని వినతి పత్రం సమర్పించాలని ప్రజలకు 12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి విజ్ఞప్తి చేశారు.

Sthanikam

కల్వర్టు లేకుండా ఎన్ హెచ్ -65 రోడ్డు పనులు.. వరద ముప్పుపై ప్రజల్లో ఆందోళన

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News