Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:21 AM

కలెక్టర్‌ను ఆశ్రయించిన ఉత్తటూరు వృద్ధురాలి కన్నీటి గాధ

05-01-2026 405 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కలెక్టర్ సారూ… కనికరించండి

పండుటాకులకు న్యాయం చేయండి

యాదాద్రి భువనగిరి స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

కూటికి దూరమై, కాటికి దగ్గరవుతున్న పండుటాకులైన వయోవృద్ధులకు న్యాయం చేయాలంటూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు రావును సీనియర్ సిటిజన్లు చేతులెత్తి వేడుకుంటున్నారు.రామన్నపేట మండలం ఉత్తటూరు గ్రామానికి చెందిన మల్లెబోయిన మీనమ్మ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి తన గోడును వినిపిస్తూ కన్నీరుమున్నీరయ్యారు. నడవలేని స్థితిలో కలెక్టరేట్‌కు వచ్చిన ఆమె, తమకు జరిగిన అన్యాయంపై అధికారుల దృష్టి సారించాలని వేడుకున్నారు.మీనమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. భర్త మల్లెబోయిన లచ్చయ్య మృతి అనంతరం ఆమె జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. తాను, భర్త కష్టపడి సంపాదించిన సర్వే నంబర్ 331 భూమిని ఇద్దరు కుమారులు సమంగా పంచుకొని వారి భార్యల పేర్లపై మార్చుకున్నారని వాపోయారు. అంతేకాకుండా తల్లిదండ్రులు పసుపు కుంకుమ కింద ఇచ్చిన సర్వే నంబర్ 251 భూమిని బ్యాంక్ లోన్ ఇప్పిస్తామని చెప్పి సంతకం చేయించుకొని ఇతరులకు విక్రయించారని ఆరోపించారు.

భూములన్నీ కోల్పోయిన మీనమ్మను కుమారులు పట్టించుకోకపోవడంతో చిన్న కూతురు కత్తుల యాక లక్ష్మీ వద్దనే గత కొన్నేళ్లుగా ఉంటున్నారు. ఇటీవల ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడించినా, “మా అమ్మతో మాకు సంబంధం లేదు” అంటూ కుమారులు నిర్లక్ష్యంగా స్పందించారని ఆమె వేదన వ్యక్తం చేశారు.

గత నెల 6న జిల్లా కలెక్టర్‌ను కలిసిన మీనమ్మను చౌటుప్పల్ ఆర్డీవో వద్దకు పంపించారు. విచారణ అనంతరం వయోవృద్ధుల సంరక్షణ చట్టం–2007 ప్రకారం మీనమ్మ పోషణ, వైద్య ఖర్చుల నిమిత్తం కుమారులు నగదు ఇవ్వాలని ఆర్డీవో ఆదేశించినా, ఆ ఆదేశాలను కుమారులు బేఖాతరు చేశారు. దీంతో కేసు నమోదు చేయాలని రామన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్‌కు ఆర్డీవో లేఖ రాశారు.అయితే పోలీసులను సంప్రదించగా కేసు నమోదు చేయకుండా జిల్లా కలెక్టర్‌ను కలవాలని సూచించడంతో ప్రజావాణిలో మళ్లీ కలెక్టర్‌ను ఆశ్రయించిన మీనమ్మ తన గోడును వెల్లగక్కారు. ఆరోగ్యం సహకరించడం లేదని, ఎడమ కాలు వేలును తొలగించాలని వైద్యులు సూచించారని, వైద్య ఖర్చులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.తన కుమారులు మల్లెబోయిన లింగయ్య, కోడలు మల్లెబోయిన ముత్తమ్మ, మనుమలు మల్లెబోయిన లక్ష్మణ్, హేమేంద్ర, గణేష్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు.

Sthanikam

కలెక్టర్‌ను ఆశ్రయించిన ఉత్తటూరు వృద్ధురాలి కన్నీటి గాధ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News