Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:18 AM

కాకతీయ నగర్ డివిజన్‌లలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాలు

06-05-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

మల్కాజిగిరి నియోజకవర్గంలోని 185 వినాయక్ నగర్, 187 కాకతీయ నగర్ డివిజన్‌లలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ సంస్థాగత ఎన్నికల భాగంగా విస్తృత స్థాయి సమావేశాలు ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశాలకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి సంస్థాగత ఎన్నికలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. డివిజన్ స్థాయి కమిటీలను సమర్థవంతంగా ఏర్పాటు చేసి పార్టీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టి, ప్రతి ఇంటికి పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

అలాగే ఎన్నికల ప్రక్రియలో ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండి ఓటర్ల హక్కులను కాపాడాలని సూచించారు. సమావేశానికి హాజరైన నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను ఎమ్మెల్యే శ్రద్ధగా విని, వాటిని గౌరవిస్తూ తగిన నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మల్కాజిగిరి అభివృద్ధి కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేయిస్తున్నామని మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలపర్చేందుకు కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేయాలని సూచించారు.

ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ రుసుములను ప్రకటించారు. సాధారణ సభ్యత్వం రూ.10, క్రియాశీలక సభ్యత్వం రూ.50గా నిర్ణయించినట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో బద్దం పరుశురాం రెడ్డి, హేమంత్ రెడ్డి, సురేష్, సంపత్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్, శేఖర్ గౌడ్, బంగారం మల్లేష్, ప్రభాకర్ రెడ్డి, కృష్ణ, అరుణ్, బాలకృష్ణ, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో హాజరై సమావేశాలను విజయవంతం చేశారు

Sthanikam

కాకతీయ నగర్ డివిజన్‌లలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News