Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 02:11 AM

కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగె హక్కు లేదు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

10-01-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికలలో ఓటు అడిగి హక్కులేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఆయన ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గత రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో చిట్యాల పట్టణానికి ఎటువంటి అభివృద్ధి జరగలేదని , అమలు కానీ హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందన్నారు. డ్వాక్రా సంఘాలు మహిళా సంఘాలకు సంబంధించిన ఇందిరమ్మ చీరల పేరుతో మహిళలను మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పట్టణానికి ఎటువంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని హుటాహుటిన ఎంపీ ఎమ్మెల్యేలు హడావుడిగా శంకుస్థాపన చేశారని, కాంగ్రెస్ నాయకులకు చిట్యాల పట్టణంలో ఓటు అడిగె హక్కు లేదని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో చిట్యాల పట్టణానికి 25 కోట్లు నిధులు రాగా పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థను, సిసి రోడ్లను నిర్మించామన్నారు. చిట్యాల పట్టణంలో వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి పకడ్బందీగా డ్రైనేజీ వ్యవస్థను నిర్మించామన్నారు. రెండు కోట్ల 80 లక్షలతో చిట్యాల పట్టణాన్ని అభివృద్ధి పరిచిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు మేము మంజూరు చేసిన పనులకు నిన్న స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు అని రెండేళ్ల నుండి చేయని శంకుస్థాపనలు నిన్ననే చేయడంలో ఆంతర్యం ఏమిటో పట్టణ ప్రజలు గ్రహించాలి అని, ఎన్నికల కోసమే కాంగ్రెస్ నాయకులు ఈ శంకుస్థాపనల డ్రామాలు చేస్తున్నారని అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేసిన పనులకు శంకుస్థాపనలు చేయడం కాదు కొత్తగా పనులు మంజూరు చేసి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. పట్టణ ప్రజలు కాంగ్రెస్ మోసాలను గ్రహించాలి, మీ పక్షాన నిలబడే వ్యక్తులను గెలిపించాలని పట్టణ ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు , పొన్నం లక్ష్మయ్య, , చేపూరి రవీందర్, మెండే సైదులు, బొబ్బిలి శివ శంకర్ రెడ్డి, కూరెళ్ల లింగస్వామి, కందాటి రమేష్ రెడ్డి, జనగాం నరసింహ, మందడి జనార్దన్ రెడ్డి, అప్సర్ జట్టా శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగె హక్కు లేదు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News