Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:13 PM

కాంగ్రెస్‌తోనే పేదల ఇంటి కల సాకారం- సర్పంచ్ జువ్వి నరసింహ

03-04-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ధర్మోజి గూడెంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే నిరుపేదల సొంతింటి కల నెరవేరుతుందని ధర్మోజి గూడెం సర్పంచ్ జువ్వి నర్సింహ్మ అన్నారు. చౌటుప్పల్ మండలం ధర్మోజి గూడెం గ్రామంలో బోనకుర్తి సునీత-హరికృష్ణ దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ జువ్వి నర్సింహ్మ కొత్త ఇంటిని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ పథకం ద్వారా పేదలకు ఇళ్లు కల్పించడం జరుగుతోందన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో బోనకుర్తి సునీత-హరికృష్ణలు తమ సొంతింటి కలను సాకారం చేసుకున్నారని తెలిపారు. పేదల పక్షాన నిలిచేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, నిరుపేదల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. త్వరలోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రారంభమవుతుందని, గ్రామంలో ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పక్కీరు శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు ఊదరి శ్రీనివాస్, ఐతరాజు లింగస్వామి-శారద, రాచకొండ భార్గవ్, జీడిముడ్ల శోభ-కొండల్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు వల్లబోతు నారాయణ, మాజీ సర్పంచ్ బద్రి లింగయ్య, మాజీ ఉప సర్పంచ్‌లు బత్తుల శ్రీహరి, కొంతం బుచ్చిరెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఊదరి శంకర్, ఊదరి నర్సింహ, డాకొజీ సతీష్, వల్లబోతు నరేష్, సురేష్, జంగం సందీప్, బత్తుల వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కాంగ్రెస్‌తోనే పేదల ఇంటి కల సాకారం- సర్పంచ్ జువ్వి నరసింహ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News