Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చెట్లు నాటమంటున్న ప్రభుత్వం.. నరికేస్తున్న యంత్రాంగం! అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 07:09 PM

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం
05-02-2026 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఇల్లందు మున్సిపాలిటీ 13వ వార్డు ప్రచారంలో మేకల మల్లిబాబు యాదవ్ గారి పిలుపు

కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణకు, ముఖ్యంగా పట్టణాలకు నిజమైన అభివృద్ధి సాధ్యమని మాజీ జెడ్పిటిసి, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ స్పష్టం చేశారు. గురువారం ఇల్లందు మున్సిపాలిటీ 11, 12, 13వ వార్డుల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలకు ఎలాంటి అవినీతికి అవకాశం లేకుండా పారదర్శకమైన పాలన అందిస్తోందన్నారు.పల్లెలతో పాటు పట్టణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇల్లందు మున్సిపాలిటీ 13వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మడుగు సాయి సుధ ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అనేక విధాలుగా దోచుకుందని, పేదలు, కార్మికులు, కర్షకులు, రైతులను మోసం చేసిందని విమర్శించారు. గతంలో గెలిచిన ప్రజా ప్రతినిధులు అధికార పార్టీని అడ్డుపెట్టుకొని ఇల్లందు మున్సిపాలిటీలో ఇసుక మాఫియా, భూ అక్రమ దందాలకు పాల్పడ్డారని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శీనన్న అండతో, స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య చొరవతో మున్సిపాలిటీ అభివృద్ధికి గణనీయమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి కోసం ఈ ఏడాది జనవరిలో మూడు కోట్ల పదిహేడు లక్షల రూపాయలతో పనులు ప్రారంభించామని, మౌలిక వసతుల కల్పన కోసం దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ 11వ వార్డు అభ్యర్థి వెంకటలక్ష్మి , 12వ వార్డు అభ్యర్థి రంపా రమ్య , 13వ వార్డు అభ్యర్థి మడుగు సాయి సుధ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ ఫతే మహమ్మద్ , గింజల నర్సిరెడ్డి , రాంరెడ్డి జగన్నాథరెడ్డి , దమ్మాలపాటి సత్యం , నల్లమోతు లక్ష్మయ్య , వెంకట నరసయ్య , తోటకూరి శివయ్య , గుజ్జర్లపూడి రాంబాబు , బొల్లి రాజు , శంకువారి సోను , మాలోత్ రాజేష్ , శ్రీరాముల రాంబాబు , శంకువార్ మోహన్ లాల్ , ఈశ్వర్ లాల్ , బక్కతట్ల వెంకన్న , మద్ది జంపయ్య , నన్నెపోయిన రవి , ఈర్ల యాదగిరి యాదవ్ , రాజబోయిన వెంకన్న , రాజు , శంకువార్ రాము , రాపర్తి రాజు , మడుగు భాస్కర్ , మడుగు సరళ , ఆశా బాయి , సీత పాశి , దేవరకొండ లావణ్య , ధనలక్ష్మి పాశి తదితరులు పాల్గొన్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.

Sthanikam

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News