Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:12 AM

కాంగ్రెస్‌పై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపణలు నిరాధారం

కాంగ్రెస్‌పై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపణలు నిరాధారం

కాంగ్రెస్‌పై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపణలు నిరాధారం
May 24, 2026 05:59 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

విచారణను ప్రభావితం చేసేందుకే తప్పుడు వ్యాఖ్యలు : గుడిపాటి నర్సయ్య

సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. టీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్యతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. విచారణను ప్రభావితం చేసేందుకే మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

హత్యా రాజకీయాల గురించి జగదీశ్ రెడ్డి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని, ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. మధు హత్య పాత కక్షలతో జరిగిందా, వ్యక్తిగత కారణాలతో జరిగిందా అనేది పోలీసుల విచారణలో తేలుతుందని పేర్కొన్నారు. విచారణ పూర్తికాకముందే కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడం తగదన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదని, దివంగత రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నాయకత్వంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం మానుకోవాలని మాజీ మంత్రికి సూచించారు. త్వరలోనే నిజాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.

మరోసారి కాంగ్రెస్ పార్టీ, నాయకులపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజాద్ అలి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, పీసీసీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ చింతమళ్ల రమేష్, జిల్లా కాంగ్రెస్ కోశాధికారి కక్కిరెని శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు దొంగరి గోవర్ధన్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలిమినేటి అభినయ్ నాయుడు, మున్సిపల్ కౌన్సిలర్ నాగుల వాసు, తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, వెన్న మధుకర్ రెడ్డి, మద్దెబోయిన శ్రీనివాస్, గడ్డం వెంకన్న, పడిదల రవి, అక్కేనపల్లి జానయ్య, అన్నమయ్య రాము, నరేందర్ నాయుడు, కోడి వెంకటయ్య, బొప్పాని శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News