Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:50 AM

కాంగ్రెస్ తోనే వార్డు అభివృద్ధి

కాంగ్రెస్ తోనే వార్డు అభివృద్ధి

కాంగ్రెస్ తోనే వార్డు అభివృద్ధి
February 06, 2026 01:25 PM 93 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

గెలిచిన వెంటనే సొంత నిధులతో సీసీ కెమెరాలు

వార్డు అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని 14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పంతంగి దశరథ స్పష్టం చేశారు. శుక్రవారం 14వ వార్డులో నిర్వహించిన గడపగడప ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తాను కౌన్సిలర్ గా గెలిచిన వెంటనే తన సొంత నిధులతో వార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను మరింత బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు.ప్రచారంలో భాగంగా వార్డు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని పంతంగి దశరథ తెలిపారు. ప్రజలు తనను సొంత బిడ్డ వలె ఆదరిస్తూ ఆశీర్వదిస్తున్నారని, ముఖ్యంగా మహిళలు, యువత, ఆడబిడ్డలు పెద్ద ఎత్తున అండగా నిలుస్తున్నారని అన్నారు. ప్రతి వీధిలో కాంగ్రెస్ పార్టీకి జై కొడుతూ ప్రజానీకం ఉత్సాహంగా మద్దతు తెలుపుతుండటం తనకు మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు.వార్డు ప్రజల భద్రత, సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. వీధుల్లో భద్రత పెంచేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు చేయడమే కాకుండా, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు, వీధిదీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కరించే కౌన్సిలర్ గా పనిచేస్తానని హామీ ఇచ్చారు.

తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకాన్ని 14వ వార్డులోని ప్రతి ఇంటికి చేరవేస్తానని పంతంగి దశరథ స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల లబ్ధి అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటానని, ఎవరూ మోసపోకుండా చూస్తానని అన్నారు.త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డులలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆశీస్సులతో 14వ వార్డులో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేస్తామని తెలిపారు.ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గోదాల రంగారెడ్డి, మాజీ జెడ్పిటిసి రాజేష్ నాయక్, నాయకులు పాండు నాయక్, లింగంపల్లి సృజన్, వరిపల్లి శంకర్, వరిపల్లి లక్ష్మయ్య, ఉమేష్, వెంకటేష్, కృష్ణ, మహేష్ తదితరులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News