Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:08 PM

కాంగ్రెస్ పార్టీతోనే వార్డుల అభివృద్ధి సాధ్యం

08-02-2026 251 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

13 వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్

చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 13వ వార్డు అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం 13వ వార్డులో గడపగడపకు ప్రచారం నిర్వహించారు. 13వ వార్డు అభివృద్ధి కోసం చేయి గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ..అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే అనేక అత్యధిక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసిన ఘనత కాంగ్రెస్ కు దక్కుతుందన్నారు.పేద కుటుంబాలకు అండగా ఉంటూ, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో 13వ వార్డులోని అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.13వ వవార్డులో సమగ్ర అభివృద్ధి కొనసాగాలంటే వార్డు ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టాలన్నారు.అభివృద్దే ధ్యేయంగా ప్రజా సేవే లక్ష్యంగా మీ ముందుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆశీర్వదించాలని ఓటర్లకు తెలియజేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో అధిక నిధులు తీసుకువచ్చి వార్డును ఆదర్శంగా వార్డుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ఈనెల 11న జరగనున్న ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జిలు వర్కాల కుమార్ గౌడ్, చేవగోని వెంకటేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్గం నరసింహ, తోర్పునూరి బాబు, మహిళలు, యువకులు, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Sthanikam

కాంగ్రెస్ పార్టీతోనే వార్డుల అభివృద్ధి సాధ్యం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News