Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విశాల భారతి పాఠశాలలో ఘనంగా బోనాలు, వరలక్ష్మి వ్రతం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 05:49 PM

కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అభ్యర్థుల విజయ లక్ష్యం:ఖేడ్‌లో సన్నాహక సమావేశం ఘనంగా

26-01-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని సాయిబాబా ఫంక్షన్ హాల్‌లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్, నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పి చంద్రశేఖర్ రెడ్డి,మాజీ జిల్లా ప్రణాళిక సంఘం సభ్యులు నగేష్ కుమార్ షేట్కార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంపీ ,శాసనసభ్యులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల వ్యవధిలోనే నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలో అనేక సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశామని తెలిపారు. పట్టణంలోని ప్రతి మున్సిపల్ వార్డులో నాణ్యమైన మురుగు కాలువలు, సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించామని అన్నారు.పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు.ఈ లక్ష్యానికి అనుగుణంగా అర్బన్ ఫారెస్ట్ ఏర్పాటు, చౌరస్తాల సుందరీకరణ పనులు చేపట్టామని చెప్పారు. గతంలో ఎవరూ ఆలోచించని విధంగా పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని నారాయణఖేడ్ పట్టణం చుట్టూ లింక్ రోడ్లను అనుసంధానం చేస్తూ రింగ్ రోడ్డును ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఎంతో కీలకమైనవని, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ప్రతి వార్డులో భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో మున్సిపల్ పట్టణ మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అభ్యర్థుల విజయ లక్ష్యం:ఖేడ్‌లో సన్నాహక సమావేశం ఘనంగా

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News