Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 10:42 PM

కాంగ్రెస్ పార్టీ ద్వారానే మున్సిపాలిటీ అభివృద్ధి

06-02-2026 124 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఇల్లందు 11, 12, 13 వార్డుల్లో జోరుగా ప్రచారం

కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పల్లెలతో పాటు పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని, గత బిఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీ ప్రాంతాలకు చేసిందేమీ లేదని మాజీ జెడ్పిటిసి, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ విమర్శించారు. ఇల్లందు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం 11, 12, 13 వార్డుల్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఇల్లందు 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోదరీమణి రంప రమ్య ను హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. గత మూడు రోజులుగా మున్సిపాలిటీ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్న మల్లిబాబు యాదవ్, కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలిచిన పార్టీ అని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత బిఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. పదేళ్లపాటు పరిపాలించి తెలంగాణను నిలువు దోపిడీ చేశారని, అలాంటి వారు మళ్లీ వచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పే మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని అన్నారు.

కేవలం రెండున్నర సంవత్సరాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పారదర్శకంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. అవినీతికి తావు లేకుండా పథకాలు మంజూరు చేస్తూ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తోందని పేర్కొన్నారు. మంత్రివర్యులు పొంగులేటి శ్రీ నన్న ప్రత్యేక శ్రద్ధతో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ద్వారా ఇల్లందు మున్సిపాలిటీ అభివృద్ధికి కంకణం కట్టుకున్నారని చెప్పారు.

ఈ కార్యక్రమంలో 12వ వార్డు అభ్యర్థి రంప రమ్య, 11వ మరియు 13వ వార్డుల అభ్యర్థులు వెంకటలక్ష్మి, సాయి సుధా తో పాటు జిల్లా కాంగ్రెస్ నాయకులు షేక్ ఫతే మహమ్మద్, ధనియాకుల హనుమంతరావు, గింజల నర్సిరెడ్డి, రాం రెడ్డి జగన్నాథ్ రెడ్డి, నల్లమోతు లక్ష్మయ్య, గుజ్జర్లపూడి రాంబాబు, దమ్మాలపాటి సత్యం, శంకువార్ మోహన్, శంకువార్ రాజు, నన్నే బోయిన రవి, వెంకన్న మద్ది, జంపయ్య, బంటు ఐలయ్య యాదవ్, పెద్ది హరిబాబు, గుండెపాక కిరణ్, ఆముదాల శ్రీనివాస్, బాల ప్రసాద్, మధు, ఎర్రం కుమార్, ఇసుకపల్లి శ్రీనివాస్, కోపెల్ల రవి, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

కాంగ్రెస్ పార్టీ ద్వారానే మున్సిపాలిటీ అభివృద్ధి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News