Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:35 AM

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

30-01-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యాదగిరిగుట్ట టౌన్:యాదగిరిగుట్ట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ల అభ్యర్థుల నామినేషన్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పట్టణంలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు నిర్వహించిన ఈ ర్యాలీకి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

భారీ జన సంద్రోహంతో సాగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నడిచారు. ర్యాలీ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ, పట్టణాల అభివృద్ధి ప్రజా ప్రతినిధుల చేతుల్లోనే ఉందని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించగలిగేది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లేనని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, అదే విధంగా మున్సిపాలిటీల్లో కూడా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నామని స్పష్టం చేశారు.

ఇళ్ల నిర్మాణం, తాగునీరు, డ్రైనేజీ, సీసీ రోడ్లు,వీధి దీపాలు, పారిశుద్ధ్యం,మహిళా సంఘాల బలోపేతం,యువతకు ఉపాధి అవకాశాలు వంటి అంశాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయని పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను భారీ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.ఈ నామినేషన్ ర్యాలీ కాంగ్రెస్ పార్టీ బలాన్ని, ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబించిందని నాయకులు పేర్కొన్నారు. కాంగ్రెస్ జెండాలు, నినాదాలతో పట్టణమంతా మార్మోగగా, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా నినాదాలు చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.

Sthanikam

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News