Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:20 PM

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచింది

16-05-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

మిల్లర్ల దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వం విఫలం....

బిజెపి కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి....

ఎన్నికల సమయంలో ఎలాంటి శరతులు లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక రైతులను నట్టేట ముంచిందని బిజెపి కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి విమర్శించారు. శనివారం అల్వాల పురం గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకైనా రూ.2 లక్షల రుణమాఫీ పూర్తిస్థాయిలో చేశారా అని ప్రశ్నించారు. వరంగల్ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలపై ఎక్కడైనా చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు.

రుణమాఫీ కాకపోవడం వల్ల బ్యాంకుల అప్పులు పెరిగి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొత్త రుణాలు రాక ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామన్న హామీని కూడా ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. రైతులు పండించిన చివర గింజ వరకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యంతో మిల్లర్లు, అధికారులు కలిసి కుమ్మక్కయి రైతులను నట్టేట ముంచారన్నారు. ఇప్పటికైనా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో అమలు చేయాలని,రాబోయే వానాకాలం సీజన్ నుండి నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు తీసుకోవాలని, అలాగే సేంద్రీయ వ్యవసాయంపై రైతులకు అగ్రికల్చర్ ఆఫీసర్లు అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. అన్ని రకాల పంటలకు మద్దతు ధర పెంచినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మామిడి తోటలను పరిశీలించారు. ఈ సమావేశంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కోశాధికారి అశోక్ రెడ్డి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వెలివోలు చిట్టిబాబు, సీనియర్ నాయకులు కనగాల వెంకటరామయ్య, బొలిశెట్టి కృష్ణయ్య, కనగాల నారాయణ, యడ్లపల్లి రామారావు, వెంకట నరసయ్య, గోదేశీ లక్ష్మణ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు......

Sthanikam

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచింది

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News