Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:05 PM

కాంగ్రెస్ నాయకుల కుట్రతోనే ఓటమి

కాంగ్రెస్ నాయకుల కుట్రతోనే ఓటమి

కాంగ్రెస్ నాయకుల కుట్రతోనే ఓటమి
18-02-2026 385 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కానుగు యాదమ్మ బాలరాజు ఆరోపణ

7వ వార్డు భీఆర్ఎస్ అభ్యర్థి

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తరఫున చౌటుప్పల్ మున్సిపాలిటీ 7వ వార్డు నుంచి పోటీ చేసిన అభ్యర్థి కానుగు యాదమ్మ బాలరాజు తన ఓటమికి కాంగ్రెస్ నాయకుల కుట్రే కారణమని ఆరోపించారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.7వ వార్డు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మొదటగా ప్రకటించిన ఫలితాల్లో తనను విజేతగా ప్రకటించారని, అనంతరం రీకౌంటింగ్ నిర్వహించి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్లు వెల్లడించారని తెలిపారు.

అధికార పార్టీ నాయకులు రిటర్నింగ్ అధికారులతో కుమ్మక్కై బ్యాలెట్ పేపర్లను తారుమారు చేశారని ఆరోపించారు. తనకు వచ్చిన ఓట్లను కాంగ్రెస్ అభ్యర్థికి మళ్లించారని పేర్కొన్నారు. మున్సిపాలిటీకి సంబంధంలేని కాంగ్రెస్ నాయకులను కౌంటింగ్ హాల్‌లోకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ఫలితంపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించలేదని ఆమె వాపోయారు. 7వ వార్డు ఫలితంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసిన కాంగ్రెస్ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని ఆమె కోరారు.

Sthanikam

కాంగ్రెస్ నాయకుల కుట్రతోనే ఓటమి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News