Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:13 PM

కాంగ్రెస్ మాయ హామీలకు ప్రజలు విసుగు. చిట్యాలలో బిఆర్ఎస్‌దే అభివృద్ధి ముద్ర – చిరుమర్తి లింగయ్య

09-02-2026 125 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ మాయమాటలు, అమలుకాని హామీలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వెల్లువెత్తుతోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధే చిట్యాల ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్న నిజమని, అదే కారణంగా బిఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో విశేష ఆదరణ పెరుగుతోందన్నారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు, ఆరు గ్యారంటీలు ఎక్కడ అమలయ్యాయో చెప్పాలని స్థానిక ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే సమాధానం లేక మౌనం వహిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలకు ఇక రోజులు చెల్లిపోయాయని స్పష్టం చేశారు.కేసీఆర్ హయాంలో చిట్యాల మున్సిపాలిటీకి రూ.45 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. అమృత్ పథకం కింద రూ.12 కోట్ల యాభై లక్షల నిధులు తాము మంజూరు చేస్తే, వాటిని తమ ఖాతాలో వేసుకుంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రజలను మోసం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.రెండేళ్ల పాలనలో కొత్తగా ఒక్క రూపాయి తెచ్చే సత్తా లేక, బిఆర్ఎస్ తెచ్చిన నిధులకు శంకుస్థాపనలు చేయడమే కాంగ్రెస్ ఎమ్మెల్యే పనిగా మారిందని ఎద్దేవా చేశారు. అభివృద్ధి గురించి మాట్లాడలేక వ్యక్తిగత దూషణలకు దిగడం కాంగ్రెస్ రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు.

ఎన్నికలు సమీపిస్తేనే పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే చిట్యాల ప్రజలు ఇప్పటికే నిజం తెలుసుకున్నారని చెప్పారు. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధే బిఆర్ఎస్ అసలైన గుర్తింపని, అదే నమ్మకంతో బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Sthanikam

కాంగ్రెస్ మాయ హామీలకు ప్రజలు విసుగు. చిట్యాలలో బిఆర్ఎస్‌దే అభివృద్ధి ముద్ర – చిరుమర్తి లింగయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News