Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 09:39 PM

కాంగ్రెస్ కార్యాలయ ప్రారంభంతో జోరందుకున్న ప్రచారం

06-02-2026 138 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

7వ వార్డులో పెద్దమామ శ్రీరాములు గెలుపే లక్ష్యంగా పిలుపు

సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట పట్టణంలోని 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో పిఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ, 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దమామ శ్రీరాములు ను ఘన విజయం సాధింపజేయాలని ప్రజలను కోరారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలిచిన పార్టీ అని, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ముఖ్యంగా పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అమలు చేస్తున్న సన్న బియ్యం పథకం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పట్టణ సౌకర్యాల విస్తరణ వంటి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయని చెప్పారు.రానున్న రోజుల్లో పట్టణ అభివృద్ధి మరింత వేగంగా సాగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం అత్యంత అవసరమని స్పష్టం చేశారు. ప్రజల మద్దతుతో 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేస్తామని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు, మహిళా విభాగం, యువజన విభాగం కార్యకర్తలు పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

కాంగ్రెస్ కార్యాలయ ప్రారంభంతో జోరందుకున్న ప్రచారం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News