Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:20 AM

కాంగ్రెస్ హామీలు వెంటనే అమలు చేయాలి ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం : ఎస్. వీరయ్య

07-05-2026 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, : రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో కూరెళ్ల నరసింహాచారి అధ్యక్షతన నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైందన్నారు. గ్రామాల్లో ఉపాధి కూలీలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు.

ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం వెనుకబడిందని, మహిళలకు రూ.2,500, ఉపాధి కూలీలకు రూ.1,200 ఇస్తామని చెప్పి ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. ఆసరా పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరులోనూ ఆలస్యం జరుగుతోందని విమర్శించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల కాకపోవడంతో పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా, జిల్లా నాయకులు మేక అశోక్ రెడ్డి, జల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కాంగ్రెస్ హామీలు వెంటనే అమలు చేయాలి ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం : ఎస్. వీరయ్య

Article Image

రామన్నపేట, : రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో కూరెళ్ల నరసింహాచారి అధ్యక్షతన నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైందన్నారు. గ్రామాల్లో ఉపాధి కూలీలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు.

ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం వెనుకబడిందని, మహిళలకు రూ.2,500, ఉపాధి కూలీలకు రూ.1,200 ఇస్తామని చెప్పి ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. ఆసరా పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరులోనూ ఆలస్యం జరుగుతోందని విమర్శించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల కాకపోవడంతో పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా, జిల్లా నాయకులు మేక అశోక్ రెడ్డి, జల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News