Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 01:49 AM

కాంగ్రెస్ గెలుపే సూర్యాపేట అభివృద్ధికి మలుపు

07-02-2026 224 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

39వ వార్డులో దూసుకుపోతున్న కాంగ్రెస్ ప్రచారం

భారీ మెజార్టీతో గెలిపించండి

కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం భాగ్యలక్ష్మి వెంకన్న పిలుపు

కాంగ్రెస్ పార్టీ గెలుపు సూర్యాపేట అభివృద్ధికి కీలక మలుపు అవుతుందని 39వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి గడ్డం భాగ్యలక్ష్మి వెంకన్న అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 39వ వార్డులో గడప గడపకు ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఓటర్లను కలిసి చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధే ధ్యేయంగా, ప్రజా సేవే లక్ష్యంగా తనను ఆశీర్వదించాలని కోరారు. కౌన్సిలర్‌గా గెలిపిస్తే మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, తెలంగాణ రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సహకారంతో అధిక నిధులు తీసుకువచ్చి వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.ఈనెల 11న జరగనున్న ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, మాజీ కౌన్సిలర్ గాజుల రాంబయమ్మ, కాంగ్రెస్ నాయకులు నాంపల్లి శ్రీనివాస్, సరస్వతీభట్ల అన్నపూర్ణ, పెద్దిరెడ్డి లక్ష్మణ్, నీలా చంద్రశేఖర్, గడ్డం చంద్రశేఖర్, గొట్టిపర్తి ప్రసాద్, సాయి, పవన్, సైదులు, మహిళలు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కాంగ్రెస్ గెలుపే సూర్యాపేట అభివృద్ధికి మలుపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News