Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 12:55 AM

కాంగ్రెస్ 420 హామీల బాకీ కార్డులతో ఖేడ్‌లో ప్రజల్లోకి మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

19-01-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల పేరుతో చేసిన 420 హామీలకు సంబంధించిన బాకీ కార్డులను నారాయణఖేడ్ పట్టణంలో ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకువచ్చిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యుడు మహారెడ్డి భూపాల్ రెడ్డి.ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిందని, కానీ రెండు సంవత్సరాలు గడిచినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, దీంతో ఒక్కో మహిళకు 62,500 రూపాయలు బాకీ పడిందని తెలిపారు.వృద్ధులకు, బీడీ కార్మికులకు నెలకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి, రెండు సంవత్సరాల కాలానికి ఒక్కొక్కరికి సుమారు 50,000 రూపాయలు చెల్లించాల్సి ఉందని అన్నారు. దివ్యాంగులకు నెలకు 6,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి, రెండు సంవత్సరాలకు ఒక్కొక్కరికి 50,000 రూపాయలకు పైగా బాకీ పెట్టారని విమర్శించారు.ఆడపిల్లల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తామని చెప్పి, నియోజకవర్గంలో జరిగిన పెళ్లిళ్లకు తులం బంగారం ఇవ్వలేదని, కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా పెళ్లిళ్లు పూర్తైన తర్వాత ఆలస్యంగా అందిస్తున్నారని అన్నారు. పెళ్లి జరిగిన ప్రతి కుటుంబానికి తులం బంగారం ఇప్పటికీ బాకీ ఉందని స్పష్టం చేశారు.విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చి, చాలా మందికి ఇవ్వకుండా మోసం చేశారని, ఫీజు రీయింబర్స్‌మెంట్ పేరుతో సుమారు 8,000 కోట్ల రూపాయలు బాకీ పెట్టారని తెలిపారు.రైతులకు రైతు భరోసా పథకం కింద రెండు సంవత్సరాలకు గాను 1 లక్ష 12 వేల రూపాయలు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటికీ ఇవ్వలేదని, వెంటనే బాకీ మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి, రెండు సంవత్సరాలకు గాను రైతులకు సుమారు 50,000 రూపాయలు బాకీ పెట్టారని అన్నారు.రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి, రెండు సంవత్సరాలకు 24,000 రూపాయలు బాకీ పెట్టారని తెలిపారు. నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, నిరుద్యోగ భృతి రూపంలో రెండు సంవత్సరాలకు 96,000 రూపాయలు బాకీ పెట్టారని విమర్శించారు.మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఓటు అడగడానికి వచ్చినప్పుడు, ముందుగా ఈ అన్ని బాకీలను చెల్లించిన తర్వాతనే ఓటు అడగాలని ప్రజలు వారిని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు.నారాయణఖేడ్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ సభ్యురాలు లక్ష్మీబాయి రవీందర్ నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు పరమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ నజీబ్, వైస్ చైర్మన్ పరశురాం, పట్టణ పార్టీ అధ్యక్షుడు నగేష్ సెట్, మాజీ ఎంపీటీసీ ముజామిల్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు అభిషేక్ శెత్కార్, విఠల్, మాజీ కోఆప్షన్ సభ్యులు అంబదాస్, గోపాల్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

కాంగ్రెస్ 420 హామీల బాకీ కార్డులతో ఖేడ్‌లో ప్రజల్లోకి మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News