Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:22 AM

కెరియర్ గ్రోత్‌పై జాతీయ ఆన్‌లైన్ వెబినార్

14-12-2025 492 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్ నగర్ స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్,

ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్‌లోని కళాశాల గ్రంథాలయ విభాగం పార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్, కెరియర్ గైడెన్స్ సెల్, తెలంగాణ స్కిల్స్ నాలెడ్జ్ సెంటర్ మరియు గ్రాడ్ గురు సంస్థ ఆధ్వర్యంలో కెరియర్ గ్రోత్, నైపుణ్యాభివృద్ధిపై జాతీయ ఆన్‌లైన్ వెబినార్ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. సురేష్‌బాబు తెలిపారు.

ఈ వెబినార్‌కు గ్రాడ్ గురు సంస్థకు చెందిన కర్నాటి ఆశ్రిత్ ముఖ్య వక్తగా పాల్గొని, ప్రస్తుత ఉద్యోగ మార్కెట్‌లో అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే విద్యార్థులు టెక్నికల్ స్కిల్స్‌తో పాటు ఇంటర్వ్యూ ఫేసింగ్ నైపుణ్యాలు కలిగి ఉండాలని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పైతాన్ వంటి స్కిల్ బేస్డ్ జాబ్స్‌కు మంచి డిమాండ్ ఉందని తెలిపారు.

వెబినార్ కన్వీనర్, కళాశాల గ్రంథపాలకులు డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో 182 మంది విద్యార్థులు, విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారని చెప్పారు. గూగుల్ ఫామ్ ద్వారా నిర్వహించిన క్విజ్‌లో పాల్గొన్న వారికి ఈ–సర్టిఫికెట్లను ఇమెయిల్ ద్వారా పంపించినట్లు తెలిపారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐక్యఏసి కోఆర్డినేటర్ డాక్టర్ మధు మాట్లాడుతూ, సరైన స్కిల్ సెట్‌తో పాటు లెర్నింగ్ ఆటిట్యూడ్ ఉంటే ఉద్యోగ అవకాశాలు సాధ్యమవుతాయని అన్నారు. అలాగే కో–కన్వీనర్ డాక్టర్ డి. మక్ల (ఇంగ్లీష్ విభాగం) ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాధాన్యతను వివరించారు. గ్లోబల్ లాంగ్వేజ్‌పై పట్టు సాధిస్తే ఇంటర్వ్యూల్లో ఎఫెక్టివ్ ప్రజెంటేషన్ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

Sthanikam

కెరియర్ గ్రోత్‌పై జాతీయ ఆన్‌లైన్ వెబినార్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News